సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమకి నచ్చని అంశం గురించి ఎవరైనా కామెంట్ చేసినపుడు వారిని టార్గెట్ చేస్తూ రకరకాలుగా ట్రోలింగ్స్ చేస్తుంటారు. అయితే సెలెబ్రిటీల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. సెలెబ్రిటీ అభిమానులమని చెప్పుకుంటూ ఫేక్ ఐడీలతో కామెంట్స్ చేసిన వారిపై ఆన్ లైన్ వేదికగా ఇబ్బంది పెట్టిన సంఘటనలు అనేకం..
మొన్నటికి మొన్న హీరోయిన్ మీరా చోప్రా తనని ట్రోలింగ్ చేసినవారిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పెళ్ళి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ట్రోలర్స్ పై కేసు పెట్టాడు. మళయాల చిత్రమైన కప్పెలా సినిమా గురించి పొగుడుతూ చేసిన కామెంట్స్ ని వ్యక్తిగతంగా తీసుకుని వాటిని వక్రీకరించి తనని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్స్ చేస్తున్నారని సోషల్ మీడియా ఐడీలతో పాటు ఫోన్ నంబర్స్ ని సబ్మిట్ చేసి కేస్ ఫైల్ చేసాడు.
అయితే ఆ కేసు మహేష్ అభిమానులపైనే అని, తరుణ్ భాస్కర్, మహేష్ సినిమాలపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యలు చేయడంతో మహేష్ అభిమానులు హర్ట్ అయ్యారని అంటున్నారు. దర్శకుడిగా రెండు సినిమాలు చేసిన తరుణ్ భాస్కర్, నటుడిగా ఫలక్ నుమా దాస్ లో కనిపించి, ఆ తర్వాత మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం వెంకటేష్ తో చేయబోయే స్క్రిప్టు పనుల్లో ఉన్నాడు.