కేరాఫ్ కంచరపాలెం సినిమాతో దర్శకుడిగా మారి విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా, రెండవ చిత్రంగా రీమేక్ ని ఎంచుకుని ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమా మళయాల చిత్రమైన మహేషింతే ప్రతీకారం సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. బాహుబలి సినిమాని నిర్మించిన ఆర్కామీడియా వర్క్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేసేందుకు రూపొందించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల వల్ల థియేటర్లు మరో రెండు మూడునెలల వరకూ తెరుచుకునేలా లేవు. దాంతో ఇక చేసేదేమీ లేక ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాన్ని డిజిటల్ లోకి తీసుకువస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా డిజిటల్ లోకి వార్తలు వస్తున్నప్పటికీ ఏ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు.
తాజాగా ఈ విషయమై చిత్రబృందం క్లారిటీతో ఉందని అంటున్నారు. వచ్చే నెల జులై 15వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య స్ట్రీమింగ్ అవనుందని, మరికొద్ది రోజులో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. మరి ఉమామహేశ్వర్ ఉగ్రరూపం ఎలా ఉంటుందో చూడాలి.