Advertisementt

ట్రెండింగ్ లో రామ్ గోపాల్ వర్మ నగ్నం హీరోయిన్..

Thu 02nd Jul 2020 05:10 PM
sweety,ramgopal varma,nagnam,sree rapaka  ట్రెండింగ్ లో రామ్ గోపాల్ వర్మ నగ్నం హీరోయిన్..
Ramgopal varma Nagnam heroine in treinding.. ట్రెండింగ్ లో రామ్ గోపాల్ వర్మ నగ్నం హీరోయిన్..
Advertisement
Ads by CJ

సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నగ్నం అనే షార్ట్ ఫిలిమ్ ని తీసి, ఎనీటైమ్ థియేటర్ అనే కొత్తరకమైన కాన్సెప్టుతో శ్రేయాస్ ఈటీ యాప్ ద్వారా రిలీజ్ చేసాడు. అంతకుముందు మియా మాల్కోవాతో చేసిన క్లైమాక్స్ సినిమాకి వందరూపాయలు ఫీజు వసూలు చేసిన వర్మ, నగ్నం లఘుచిత్రానికి రెండు వందల రూపాయలు వసూలు చేసాడు. 22 నిమిషాల ఈ షార్ట్ ఫిలిమ్ ఎంతమాత్రం బాగాలేదని విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

అయితే ఎన్ని విమర్శలు వస్తున్నాయో అంతకన్నా ఎక్కువ వసూళ్ళు కూడా వస్తున్నాయి. అదలా ఉంచితే నగ్నం షార్ట్ ఫిలిమ్ లో నటించిన స్వీటీ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన స్వీటీ తన గురించి ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. తన అసలు పేరూ శ్రీ రాపాక అని, పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి నుండి వచ్చానని చెప్పిన శ్రీ, నగ్నం సినిమాకి రెండు లక్షల పారితోషికం తీసుకుందట. 

ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న శ్రీ రాపాక తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇప్పటి వరకు 40కి పైగా చిత్రాలకి పనిచేసిందట. ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్ లో నిఫ్ట్ చేరి, ఆ తర్వాత యూఎస్ కి వెళ్ళిందట. తిరిగొచ్చిన తర్వాత ఇక్కడ టీవీ ఛానెల్స్ లో పనిచేసిన శ్రీ అనుకోకుండా నటనలోకి వచ్చిందట.

Ramgopal varma Nagnam heroine in treinding..:

Ramgopal varma Nagnam heroine in treinding..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ