Advertisementt

ఇలియానా మిస్టరీ చెప్పదంట.. బాధపడుతుందట!

Fri 03rd Jul 2020 12:56 PM
ileana dcruz,break up,andrew kneebone,affairs,ileana heroine  ఇలియానా మిస్టరీ చెప్పదంట.. బాధపడుతుందట!
Ileana DCruz opens up on break up with Andrew Kneebone ఇలియానా మిస్టరీ చెప్పదంట.. బాధపడుతుందట!
Advertisement
Ads by CJ

గోవా సుందరి ఇలియానా ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తుంది. బాలీవుడ్ మీద భారీ ఆశలు పెట్టుకున్న ఇలియానాకి అక్కడ చుక్కెదురు కావడంతో.. సౌత్‌ని చిన్న చూపు చూసిన ఇలియానా మళ్లీ సౌత్ అవకాశాల కోసం వెంపర్లాడుతుంది. అయితే రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని తర్వాత ఇలియానాని  పట్టించుకున్న నాధుడు లేడు. ఏదో తాజాగా నాగార్జున సినిమాలో ఇలియానా పేరు హీరోయిన్స్ లిస్ట్ లో పరిశీలనలో ఉన్నట్లుగా టాక్ అయితే ఉంది. అయితే ఇలియానా గతంలో సినిమాలని రిజెక్ట్ చెయ్యడానికి.. ఆమెకి అవకాశాలు తగ్గడానికి కారణం ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌. ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌తో ఇలియానా చాలా రోజులు ప్రేమాయణం నడిపింది. అసలు పెళ్లి కాకుండానే సహజీవనం చేసింది అని కూడా అన్నారు. కానీ ఇలియానా ఉన్నట్టుండి ఆండ్రూ నీబోస్‌ తో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది. అదిగో అప్పటినుండి ఇప్పటివరకు తన ప్రేమ, బ్రేకప్ వార్తలపై ఎప్పుడు మాట్లాడలేదు. కానీ తాజాగా ఇలియానా మొదటిసారి ప్రేమ, బ్రేకప్ పై మాట్లాడింది.

ప్రేమలో ఉన్నప్పుడు మనకేమి కనిపించింది. అంత అందంగానే కనబడుతుంది. ఆ మధుర క్షణాలను అనుభవించడానికి టైం సరిపోదు. ఆండ్రూ నీబోస్ తో ఉన్నప్పుడు కాలం ఐస్ క్రీం లా కరిగిపోయేది. కానీ నేను ఏంటో ఇష్టపడిన ఆండ్రూ నీబోస్ నుండి విడిపోయినప్పుడు చాలా బాధ పడ్డాను. ఆ నిజాన్ని నమ్మడానికి నా శక్తి సరిపోలేదు. మానసికంగా చాలా సంఘర్షణకు లోనయ్యాను. ఆ బాధ నుండి బయటపడడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఎవరు కారణం లేకుండా ప్రేమని దూరం చేసుకోరు. కాకపోతే ఆ కారణం చెప్పడం వలన ఆండ్రూ నీబోస్‌ని బాధ పెట్టాల్సి వస్తుంది. అందుకే కారణం అలా మిస్టరీగానే మిగిలిపోనివ్వండి అంటుంది. అయితే  మనం ఇతరుల ఎఫైర్స్‌, వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనం ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తాం. ఇక ఆండ్రూ నీబోస్ గురించి మాట్లాడి.. అతని స్వేచ్చకీ భంగం కలిగించడం నాకు ఇష్టం లేదు అంటూ ఏదేదో మాట్లాడుతుంది ఇలియానా. అంతగా ప్రేమించిన ఆండ్రూ నీబోస్‌ని వదులుకుని ఇలియానా చాలానే బాధపడిందనేది మాత్రం అర్థమవుతుంది.

Ileana DCruz opens up on break up with Andrew Kneebone:

Fan asks Ileana DCruz if she is single or in a relationship

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ