Advertisementt

ఆమె లేదంటే చాలా బాధేస్తోంది: అల్లు అర్జున్!

Sat 04th Jul 2020 08:00 AM
allu arjun,tweet,saroj khan,demise,first choreographer  ఆమె లేదంటే చాలా బాధేస్తోంది: అల్లు అర్జున్!
Allu Arjun Tweet on Saroj Khan Demise ఆమె లేదంటే చాలా బాధేస్తోంది: అల్లు అర్జున్!
Advertisement
Ads by CJ

నా కెరీర్ మొద‌టి కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మాస్టర్ జీస‌, మదర్ ఆఫ్ కొరియోగ్రఫీ అని అంతా ప్రేమగా పిలిచే  ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గుండె పోటుతో శుక్రవారం క‌న్ను మూసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరోజ ఖాన్ మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తూ ఆమె కుటుంబ సభ్యులుకు, సన్నిహితులుకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, అలానే స‌రోజ్ ఖాన్ తో కలిసి డాడీ సినిమా కోసం పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

తన సినీ కెర్రిర్ కు తొలి కొరియోగ్రాఫర్ గా సరోజ్ ఖాన్ వంటి అనుభవశాలితో పని చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లుగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఆమె మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు గా అల్లు అర్జున్ అభివర్ణించారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరో గా నటించిన డాడీ సినిమాకు అప్పటి ఇండియన్ స్టార్ కొరియోగ్రాఫర్ స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్ గా పనిచేశారు. ఈ సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ జ‌రిగింది. ఈ సినిమాలో డాన్స‌ర్ గా అల్లు అర్జున్ వేసిన స్టైప్స్ మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ వేసిన‌ ఈ డాన్స్ మూమెంట్స్ ని స్వ‌యంగా స‌రోజ్ ఖాన్ కంపోజ్ చేయ‌డం విశేషం. చిరు న‌టించిన చూడాల‌ని ఉంది సినిమాకి కూడా స‌రోజ్ ఖాన్ కొరియోగ్రాఫ‌ర్ గా ప‌ని చేశారు.

Allu Arjun Tweet on Saroj Khan Demise:

Saroj Khan is my First choreographer tweeted Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ