Advertisementt

ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల విలన్ ఎవరో తెలుసా?

Sun 05th Jul 2020 06:27 AM
manchu manoj,villain,jr ntr,trivikram film,manchu hero  ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల విలన్ ఎవరో తెలుసా?
Manchu Hero to Become Jr NTR Villain? ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల విలన్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌కి ఇండస్ట్రీలో దోస్త్‌లు బాగా ఎక్కువే. రామ్ చరణ్‌తో డీప్ ఫ్రెండ్ షిప్ చేస్తున్న ఎన్టీఆర్‌కి మంచు మనోజ్ కూడా మంచి ఫ్రెండ్. రామ్ చరణ్ ఫ్యామిలితో తరుచూ కలిసే ఎన్టీఆర్.. మనోజ్‌ని తన ఇంటికి ఏ టైమ్‌లో అయినా రానిచ్చేంత మంచి ఫ్రెండ్. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయినప్పుడు.. మనోజ్ ఓ బౌన్సర్ లా ఎన్టీఆర్ వెన్నంటి ఉన్నాడు. అయితే తాజాగా మంచు మనోజ్ ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడా? అంటే సోషల్ మీడియా అయితే అవుననే అంటుంది. మంచు మోహన్ బాబు వారసత్వంగా సినిమాల్లోకి అడుగుపెట్టిన స్టార్ రేంజ్ అందుకోలేక అలాగే ఫ్యామిలీ ఇష్యూస్‌తో కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్.. తాజాగా అహం బ్రహ్మస్మి అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. లాక్ డౌన్ తో ఆసినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా మంచు మనోజ్.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినబడుతుంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ అవ్వగానే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ మీదకెళుతుంది. ఆ సినిమాలో విలన్‌గా రకరకాల పేర్లు వినబడ్డాయి. అందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు బాగా వినబడింది. తాజాగా మంచు మనోజ్ అయితే బావుంటుంది, కొత్తగా ఉంటుంది అని ఎన్టీఆర్ త్రివిక్రమ్‌కి చెప్పినట్టుగా... త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ ఆలోచన బావుందని తెలిపినట్లుగా వార్తలు సంచరిస్తున్నాయి. ఇప్పటికే అది పినిశెట్టి, నవీన్ చంద్ర లాంటి హీరోలు విలన్‌గా అదరగొట్టేశారు. అందుకే మనోజ్ ని విలన్ పాత్ర చేస్తావా అని సంప్రదిద్దామని అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో మరీ విలనిజంలా నరుకుళ్లు, పొడవడాలు, తలలు లేపెయ్యడాలు ఉండకుండా మనోజ్ పాత్ర స్టైలిష్ విలన్‌గా ఎత్తుకు పై ఎత్తు వేసే విలన్‌గా ఉండబోతుందట. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా పొలిటికల్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కుతుంది. అంటే మనోజ్ ఓ స్టయిలిష్ పొలిటీషియన్‌గా కనిపిస్తాడేమో చూడాలి.

Manchu Hero to Become Jr NTR Villain?:

Manchu Manoj villain in jr ntr and Trivikram Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ