మళయాల చిత్రాల రీమేక్ హక్కుల కోసం తెలుగు నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇప్పటికే తెలుగులో రీమేక్ కాబోయే మళయాల చిత్రాల లిస్టు చాలా పెద్దగానే ఉంది. అయితే తాజాగా ఆ లిస్టులోకి మరో చిత్రం వచ్చి చేరింది. ఈ సంవత్సరం మార్చిలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా నడుస్తున్న టైమ్ లో కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఎక్కువమంది జనాలకి రీచ్ కాలేని కప్పెలా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ ముందుకు వచ్చింది.
భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కప్పెలా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనుంది. ఈ మేరకు కప్పెలా చిత్ర నిర్మాత విష్ణు తన అధికారిక సొషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. అయితే సితార బ్యానర్ రీమేక్ చేస్తున్న మూడవ మళయాల చిత్రం ఇది. నాగచైతన్య హీరోగా ప్రేమమ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అయ్యప్పనుమ్ కోషియం ఇంకా వెయిటింగ్ లో ఉంది. ఇప్పుడు తాజాగా కప్పెలా..
అయితే అయ్యప్పనుమ్ కోషియం చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో రానా, రవితేజ హీరోలుగా చేస్తున్నారని వినబడుతుంది. మరి కొత్తగా రీమేక్ రైట్స్ దక్కించుకున్న కప్పెలా చిత్రంలో ఎవరు నటించనున్నారో చూడాలి.