Advertisementt

‘ఫ్రెండ్‌షిప్’ ‘సూప‌ర్ స్టార్ ఆంథెమ్‌’ని వదిలారు

Mon 06th Jul 2020 10:56 AM
friendship movie,super star anthem,raghava lawarence,harbhajan singh,single  ‘ఫ్రెండ్‌షిప్’ ‘సూప‌ర్ స్టార్ ఆంథెమ్‌’ని వదిలారు
Friendship Movie Super Star Anthem Released ‘ఫ్రెండ్‌షిప్’ ‘సూప‌ర్ స్టార్ ఆంథెమ్‌’ని వదిలారు
Advertisement
Ads by CJ

హ‌ర్భ‌జ‌న్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ సినిమాలోని సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆంథెమ్ చాలా బాగుంది - రాఘవ లారెన్స్.
నా దేహ‌మంతా సూప‌ర్ స్టార్ నా ప్రాణ‌మంతా సూప‌ర్ స్టార్ నా ఊపిరంతా సూప‌ర్‌స్టార్ గొంతెత్తి పాడై సూప‌ర్‌స్టార్ అంటూ హూషారుగా సాగే ఈ పాట‌తో సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్‌కి ప‌ర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు ‘ఫ్రెండ్‌షిప్‌’  చిత్ర యూనిట్‌. తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రమిది. ఇటీవ‌ల విడుద‌లైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రాబట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ సూప‌ర్ స్టార్ ర‌జినీ ఆంథెమ్ లిరిక‌ల్ సాంగ్‌ను రజినీకాంత్‌ను అమితంగా అభిమానించే రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‌తలైవా ట్రిబ్యూట్ సాంగ్ ‘సూప‌ర్ స్టార్ ఆంథెమ్‌’ని రిలీజ్‌ ‌చేయ‌డం సంతోషంగా ఉంది. పాట చాలా బాగుంది. హ‌ర్భ‌జ‌న్ సింగ్ గారికి మ‌రియు ‘ఫ్రెండ్‌షిప్’ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు డి.ఎమ్ ఉద‌య‌‌కుమార్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కి  రాజశ్రీ సుధాక‌ర్ లిరిక్స్ రాయ‌గా మాస్‌ని హ‌త్తుకునేలా హేమ‌చంద్ర చాలా బాగా పాడారు. నాలుగు భాషల్లోనూ ఈ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. త‌మిళ  బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, స‌తీష్‌ న‌టిస్తున్నారు. జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, ఇంగ్లీష్ భాషల‌లో విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్: వేల్‌మురుగ‌న్‌, రాబిన్‌,
ప్రొడ్యూస‌ర్స్: జెపిఆర్ & స్టాలిన్,
ద‌ర్శ‌క‌త్వం: జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య.

Click Here for Single

Friendship Movie Super Star Anthem Released:

Raghava Lawrence released Friendship Movie Super Star Anthem

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ