Advertisementt

బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది..!

Mon 06th Jul 2020 11:24 AM
amala paul,boyapati srinu,balakrishna,heroine,bb3 movie  బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది..!
One More Heroine name for Boyapati and Balayya Movie బాలయ్యకు హీరోయిన్ దొరికేసింది..!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో ముచ్చటగా మూడో మూవీ తెరకెక్కుతుంది. సింహ, లెజెండ్ మూవీస్ బ్లాక్ బస్టర్స్ అవడంతో.. ఇప్పుడు తెరకెక్కుతున్న మూడో సినిమాపై ఫాన్స్‌లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్‌లోను భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన బాలయ్య కొత్త మూవీ టీజర్ ఓ రేంజ్‌లో పేలింది. అయితే ఈ సినిమా కరోనాకు ముందు కొంతమేర షూటింగ్ చేసుకుంది. కొంత షూటింగ్ జరిగినా బాలకృష్ణ కోసం బోయపాటి ఇంతవరకు హీరోయిన్‌ని సెట్ చెయ్యలేదు. బోయపాటి లక్కీ గర్ల్ కేథరిన్‌ని బాలయ్యకి హీరోయిన్‌గా బోయపాటి ఎంపిక చేసాడనే న్యూస్ ఉంది. కానీ తాజాగా మరో పేరు ప్రచారం లోకొచ్చింది. అది కూడా బోల్డ్ పాత్రలకు సై అంటున్న ‘ఆమె’ని బోయపాటి బాలయ్య కోసం తీసుకురాబోతున్నాడట.
తమిళ హీరోయిన్ అమలా పాల్ ఈమధ్యన ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో బాగా హైలెట్ అయినా.. సినిమాల్తో మాత్రం బాగా బిజీ. ‘ఆమె’ సినిమాలో బోల్డ్‌గా నటించిన అమలా పాల్ బాలయ్య పక్కన అయితే బావుంటుంది అని బోయపాటి అనుకుంటున్నాడట. ప్రస్తుతం కరోనా కారణంగా ఆమెని నేరుగా కలవలేకపోయినా.. ఫోన్ లోనే సంప్రదిద్దామని బోయపాటి తన టీం తో చెప్పాడట. అయితే కరోనా లాక్‌డౌన్ ముగిసి షూటింగ్స్ ప్రారంభమవుతున్నా బాలయ్య మాత్రం ఇంకా సిద్ధంగా లేడట. కరోనా తగ్గాకే షూటింగ్‌కి వెళదామని బోయపాటికి చెప్పాడట. బోయపాటి మాత్రం బాలయ్య ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకొస్తాడా.. ఎప్పుడెప్పుడు సినిమాని ఫినిష్ చేద్దామా అనే అతృతతో ఉన్నాడట.

One More Heroine name for Boyapati and Balayya Movie:

Amala Paul for Balayya and Boyapati BB3 Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ