Advertisementt

ఓ బేబీ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది..

Sun 05th Jul 2020 01:37 PM
samantha,oh baby,rao ramesh,nagashourya,nandini reddy  ఓ బేబీ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది..
Oh baby completed one year.. ఓ బేబీ సంవత్సరం కంప్లీట్ చేసుకుంది..
Advertisement
Ads by CJ

ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అందరి మనసులని మాయ చేసింది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ అవకాశాలు తెచ్చుకుంటూనే ఉంది. తన మొదటి హీరో నాగచైతన్యని పెళ్ళి చేసుకుని తెలుగింటి కోడలిగా మారిన తర్వాత ఆమె ఎంచుకునే కథల్లో చాలా మార్పు వచ్చింది.

అయితే గత ఏడాది సమంత నటించిన ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఈ సినిమా రిలీజై నేటితో సంవత్సరం పూర్తయింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజైన ఓ బేబీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

60ఏళ్ళ వృద్ధురాలు ఫోటోదిగగానే 24ఏళ్ళ యువతిగా మారిపోవడం అనే వినూత్నమైన అంశంతో రూపొందిన ఈ చిత్రంలో సమంత నటన అందర్నీ ఆకర్షించింది. అందుకే ఈ సినిమా సమంత కెరీర్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, నాగశౌర్య, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Oh baby completed one year..:

Oh baby completed one year..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ