Advertisementt

కార్తీక్ రత్నం ‘అర్థ శతాబ్దం’ గ్లిమ్స్‌ విడుదల

Tue 07th Jul 2020 01:34 PM
rana daggubati,released,ardhashathabdham,glimpse,karthik rathnam  కార్తీక్ రత్నం ‘అర్థ శతాబ్దం’ గ్లిమ్స్‌ విడుదల
Karthik Rathnam Ardhashathabdham Glimpse Released కార్తీక్ రత్నం ‘అర్థ శతాబ్దం’ గ్లిమ్స్‌ విడుదల
Advertisement
Ads by CJ

నటుడు ‘కార్తీక్ రత్నం’ పుట్టినరోజు సందర్భంగా ‘అర్థ శతాబ్దం’ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్‌ను విడుదల చేసిన హీరో ‘రానా దగ్గుబాటి’
రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు అక్కి ఆర్ట్స్ పతాకాలపై.. కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్ధం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర గ్లిమ్స్‌ను హీరో కార్తీక్ రత్నం పుట్టినరోజు సందర్భంగా, భళ్లాలదేవ రానా దగ్గుబాటి విడుదల చేశారు.
‘కేరాఫ్ కంచెరపాలెం’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నారు. అలాగే అర్థ శతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు రవీంద్ర  ఏదయితే స్టోరీ నేరేట్ చేశాడో.. దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, సినిమా బాగా వస్తుందని నిర్మాతలు తెలుపుతున్నారు. ప్రముఖ తారాగణం అంతా నటిస్తోన్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్స్: రిషిత శ్రీ క్రియేషన్స్, అక్కి ఆర్ట్స్
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే,
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు,
సహా నిర్మాత : అక్కి
డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్),
సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)
ఆర్ట్: సుమిత్ పటేల్,
కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ
ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్,
పాటలు: రెహమాన్,
స్టాంట్స్: అంజి,
పిఆర్ఓ: సాయి సతీష్.

Click Here for Glimpse

Karthik Rathnam Ardhashathabdham Glimpse Released:

Rana Daggubati Released Ardhashathabdham Glimpse

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ