బాలకృష్ణ - బోయపాటి కాంబోలో ఇంతకుముందు తెరకెక్కిన సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి.. ఈ సినిమాలు విడుదలకన్నా ముందే టైటిల్స్ విషయంలోనే హిట్ పక్కా అనేలా ఉన్నాయి. మంచి మాస్ మసాలాతో తెరకెక్కిన ఆ రెండు సినిమాలు టైటిల్ విషయంలోనే కాదు.. కంటెంట్ పరంగాను బ్లాక్ బస్టర్ హిట్స్. అందుకే వారి కాంబోలో వస్తున్న మూడో సినిమాపై విపరీతమైన అంచనాలు. తాజాగా విడుదలైన బోయపాటి - బాలయ్యల సినిమా టీజర్ ధూమ్ ధామ్ అంటూ యూట్యూబ్‌నే దడదడ లాడించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై సోషల్ ఇండియాలో నందమూరి ఆభిమానులు బాగా టెన్షన్ ఫీలవుతున్నారు. నిన్నటివరకు బాలయ్య - బోయపాటిల కాంబో మూవీకి మోనార్క్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. నందమూరి ఫ్యాన్స్ కూడా టైటిల్ అదిరింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యారు.
తాజాగా.. బాలయ్య - బోయపాటి సినిమాకి టైటిల్ మోనార్క్ కాదని సూపర్ మ్యాన్ అనే మరో టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. గతంలో సూపర్ మ్యాన్ అనే టైటిల్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. అంతేకాదు బోయపాటి - బాలయ్య ల పవర్ ఫుల్ కథకి ఈ సూపర్ మ్యాన్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి ఈ సూపర్ మ్యాన్ టైటిల్‌కే మొగ్గు చూపుతున్నాడట. కానీ నందమూరి ఫ్యాన్స్ మాత్రం సూపర్ మ్యాన్ టైటిల్ బాలయ్యకి బాలేదు.. మోనార్క్ టైటిల్ అయితేనే పవర్‌ఫుల్ గా ఉంటుంది.. ఒక్కసారి ఆలోచించు బోయపాటి అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారట.