‘ఎఫ్ 2’ భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడికి మహేష్ లాంటి స్టార్ హీరో తగలడం వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ పట్టాలెక్కించి హిట్ కొట్టడం జరిగింది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ చేస్తుంటే... అనిల్ రావిపూడి మాత్రం ఇంకా ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్‌లోనే ఉన్నాడనుకుంటున్నారు. అయితే అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ మీద కూర్చోవడం దాన్ని పూర్తి చెయ్యడం జరిగినా.. అటు వెంకటేష్ ఇటు వరుణ్ తేజ్ లు ఇప్పుడప్పుడే అనిల్ కి డేట్స్ ఇచ్చేలా లేరు. వెంకీ ‘నారప్ప’, వరుణ్ తేజ్ కొత్త సినిమాల హడావిడి అవ్వాలి. ప్రస్తుతం కరోనా కారణంగా ‘నారప్ప’ కానీ వరుణ్ తేజ్ కొత్త సినిమా కానీ పూర్తయ్యేలా లేదు. మరి అనిల్ రావిపూడి కూడా వెంకీ, వరుణ్ డేట్స్ ఇచ్చేవరకు ఆగలేనంటున్నాడు.
‘ఎఫ్ 3’తో పాటుగా మరో కథ కూడా అనిల్ రావిపూడి సిద్ధం చేసుకున్నాడట. అంటే ‘ఎఫ్ 3’ పట్టాలెక్కితే ఓకే.. లేదంటే ఆ కథతో ఓ యంగ్ హీరోతో ఈ లోపు ఓ సినిమా చెయ్యాలని అనిల్ ప్లాన్‌గా చెబుతున్నారు. ‘ఎఫ్ 3’ తర్వాత చూద్దాం ముందు తన దగ్గర ఉన్న కథని ఏ యంగ్ హీరోకైనా వినిపించాలని అనిల్ డిసైడ్ అయ్యాడట. సరిలేరు నీకెవ్వరుతో భారీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఏ యంగ్ హీరోనైనా కలవాలి కానీ.. వాళ్ళు అనిల్ కి నో ఎందుకు చెప్తారు... చూద్దాం.