హీరోయిన్ నిత్యా మీనన్ ఎప్పుడూ నటిని అవుతానని కానీ, అవ్వాలని కానీ అనుకోలేదట. ఎప్పుడు చదువుపైనే ధ్యాస పెట్టేదట. ఈ విషయం నిత్యా మీనన్ చెబుతుంది. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించి గ్లామర్‌తోనే కాదు.. నటనతోను కెరీర్‌ని దున్నేయ్యవచ్చని నిరూపించిన నటి నిత్యా మీనన్. అయితే తాజాగా తనకి సినిమాలోకి రావాలనే ఆశ లేదని చెబుతుంది. మీరు సినిమాల్లోకి ఎంటరైనప్పుడు ఎదుర్కున్న సవాళ్లేమిటి... ఎన్ని ఆడిషన్స్ లో మిమ్మల్ని రిజెక్ట్ చేసారు అని అడిగిన ప్రశ్నలకు.. నేను నటిని అవ్వాలని అనుకుంటే.. ఆడిషన్‌కి వెళ్లాల్సి వచ్చేది. కానీ నా దృష్టి ఎప్పుడు చదువుపైనే ఉండేది. మాస్టర్స్ చెయ్యాలి. తర్వాత పిహెచ్‌డి చేసి విదేశాలకు వెళ్లిపోవాలని, అక్కడే సెటిలవ్వాలని ఉండేది.
కానీ నటిని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. అయితే విధి రాత మార్చలేము కదా అంటుంది. నేను వద్దనుకున్నా సినిమా రంగం నన్ను ఆహ్వానించింది. నేను ఎలాంటి ఆడిషన్స్ కి, ఫ్యాషన్ షోలకి వెళ్లకుండానే నాకు అవకాశాలొచ్చాయి. అందుకే ఆడిషన్స్ లో రిజెక్ట్ అవడం కానీ, నన్ను వద్దనే వాళ్ళు కానీ లేరు. నా మనసుకు నచ్చిన కథలని ఎంపిక చేసుకుని సినిమాలు చేశాను. కాకపోతే నాలుగేళ్ళ వరకు నేను సినిమాలను అంత నటనను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు నటనపై పూర్తిగా సీరియస్ గా దృష్టి పెట్టా అంటుంది నిత్య మీనన్.