Advertisementt

‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ సాంగ్ విడుదల

Wed 08th Jul 2020 09:37 AM
aanandam aaratam single,uma maheshwara ugra roopasya,satyadev,venkatesh maha  ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ సాంగ్ విడుదల
Aanandam Aaratam single from Uma Maheshwara Ugra Roopasya unveiled ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ సాంగ్ విడుదల
Advertisement
Ads by CJ

‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ చిత్రం నుండి ‘ఆనందం ఆరాటం...’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల 

తెలుగు సినిమా స్థాయిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘బాహుబ‌లి’. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు గ‌ర్వ‌ప‌డే ఈ గొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని. అంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన ఈ నిర్మాత‌లు అందిస్తోన్న మ‌రో కంటెంట్ బేస్డ్ మూవీ ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’. ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై  శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా ‘కేరాఫ్ కంచ‌పాలెం’ ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం ‘మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించారు. 

జాతీయ అవార్డు గ్ర‌హీత బిజిబ‌ల్ సంగీతం అందించిన ఈ సినిమాలో ‘ఆనందం ఆరాటం...’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెహ‌మాన్ రాసిన ఈ పాట‌ను గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్‌, సౌమ్యా రామకృష్ణ‌న్ ఆల‌పించారు. సాంగ్ విజువ‌ల్స్ చూస్తుంటే ప‌క్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన సాంగ్ అని అర్థ‌మ‌వుతుంది. 

ఈ సందర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ - ‘‘డైరెక్ట‌ర్ వెంక‌ట్ మ‌హా మ‌న నెటివిటీకి త‌గిన‌ట్టు మంచి ఎమోష‌న్స్‌తో ‘ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌’ సినిమాను అద్భుతంగా మ‌లిచారు. టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇప్పుడు లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘ఆనందం ఆరాటం..’ అనే సాంగ్‌ను విడుద‌ల చేశాం. గుడ్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాకు సంబంధించిన అన్నీ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం’’ అన్నారు. 

న‌టీన‌టులు: 

స‌త్య‌దేవ్‌, న‌రేశ్‌, సుహాస్, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, టీఎన్ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హా

నిర్మాత‌లు: విజ‌య్ ప్ర‌వీణ ప‌రుచూరి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వసంత్ జుర్రు

లైన్ ప్రొడ్యూస‌ర్‌: ప్ర‌జ్ఞ‌య్ కొనిగ‌రి

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: రాము.ఆర్‌.కె

సినిమాటోగ్ర‌ఫీ: అప్పు ప్ర‌భాక‌ర్‌

సంగీతం: బిజిబ‌ల్‌

ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజాల‌

క‌థ‌: శ‌్యామ్ పుష్క‌ర‌న్‌

కాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మి

సౌండ్ డిజైన‌ర్‌: నాగార్జున త‌ల‌ప‌ల్లి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సుశాంత్ సావంత్‌

Aanandam Aaratam single from Uma Maheshwara Ugra Roopasya unveiled :

Uma Maheshwara Ugra Roopasya song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ