Advertisementt

హీరోయిన్ల వేటలో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. ఆమె ఫిక్స్..?

Wed 08th Jul 2020 01:51 PM
rx 100,ajay bhupathi,rashi khanna,sharvanand  హీరోయిన్ల వేటలో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. ఆమె ఫిక్స్..?
RX 100 director searching for heroine in his Mahasamudram.. హీరోయిన్ల వేటలో ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్.. ఆమె ఫిక్స్..?
Advertisement
Ads by CJ

ఆర్ ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న అజయ్ భూపతి తన తర్వాతి సినిమా మహాసముద్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలు పెట్టాడు. సాధారణంగా మొదటి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకులు ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత నిర్మాతలే డైరెక్టర్ల కోసం క్యూలు కడుతుంటారు. అయితే అజయ్ భూపతి విషయంలో మాత్రం కథ వేరేలా జరిగింది.

మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 సూపర్ హిట్ అయినా కూడా అంత ఈజీగా రెండవ చిత్రానికి అవకాశం రాలేదు. అయితే అలా రాకపోవడానికి రకరకాల ఫ్యాక్టర్స్ కారణమయ్యాయి. ఆ విషయం అటుంచితే, ప్రస్తుతం తన రెండవ చిత్రం మహాసముద్రం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అధికారికంగా ఈ విషయంలో ఎలాంటి సమాచారం రానప్పటికీ హీరోగా శర్వా ఫిక్స్ అని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడట. తాజగా అజయ్ భూపతి మహాసముద్రంలో నటించబోయే హీరోయిన్ల వేటలో పడ్డాడు. శర్వా పక్కన హీరోయిన్ గా రాశీఖన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకి కూడా కమిట్ అవ్వని రాశీకి ఈ అవకాశం వస్తే చాలా ప్లస్ అవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..

RX 100 director searching for heroine in his Mahasamudram..:

RX 100 director searching for heroine in his Mahasamudram..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ