Advertisementt

ఒకే రోజు రెండు పండగలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తారో..!

Wed 08th Jul 2020 03:32 PM
prabhas20,radhakrishna,bahubali beginning,pooja hegde  ఒకే రోజు రెండు పండగలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తారో..!
Will Prabhas fans achieve this feat..? ఒకే రోజు రెండు పండగలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తారో..!
Advertisement
Ads by CJ

ప్రభాస్ 20వ చిత్ర అప్డేట్స్ గురించి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై చిత్ర నిర్మాత యూవీ క్రియేషన్స్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నిరసన కూడా చేపట్టారు. అయితే అభిమానుల కోరిక నెరవేర్చడానికి సిద్ధమైన యూవీ క్రియేషన్స్ ఈ నెల 10వ తేదీన ప్రభాస్ 20వ సినిమా  ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.

ఆ ఉత్సాహంలో సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొట్టాలని సంకల్పించారు. అయితే జులై 10వ తేదీన ప్రభాస్ ని నేషనల్ స్టార్ గా మార్చిన బాహుబలి చిత్రం విడుదల అయింది. ఈ మధ్య సినిమా యానివర్సరీలకి సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మరి ఒకే రోజు రెండు పండుగలు రావడంతో ప్రభాస్ అభిమానులు దేనిమీద కాన్సన్ ట్రేట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఒకవైపు ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చిన చిత్రం, మరోవైపు ప్రభాస్ కొత్త చిత్రం. మరి ఈ రెండింటినీ ట్రెండింగ్ లో ఉంచడం కొద్దిగా కష్టమైన పనే. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫీట్ కి రెడీ అయ్యారట. బాహుబలి ది బిగినింగ్ సినిమాతో పాటు ప్రభాస్ 20వ చిత్ర ఫస్ట్ లుక్ కూడా ట్రెండింగ్ లో ఉంచేందుకు సిద్ధం అయ్యారట. మరి అభిమానులు ఏం చేస్తారో చూడాలి.

Will Prabhas fans achieve this feat..?:

Will Prabhas fans achieve this feat..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ