నెల రోజుల ముందు వరకు కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మూడు నెలలు షూటింగ్స్ లేక అల్లాడిన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ జూన్ 8 నుండి ఒక్కొక్కటిగా పట్టాలెక్కడానికి రెడీ అయ్యాయి. సినిమాల సంగతెలా ఉన్నా సీరియల్స్ షూటింగ్ మాత్రం వరసబెట్టి సెట్స్ కెళ్ళిపోయాయి. కానీ సినిమా షూటింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. సినిమా షూటింగ్స్ కోసం కంకణం కట్టుకుని గ్యాంగ్‌ని వెంటేసుకుని తిరిగిన చిరంజీవి సైలెంట్‌గా వేడుక చూడడం తప్ప ఏం చెయ్యడం లేదు. తలసానితో తన ఇంట్లోనే నాగార్జున, దర్శకనిర్మాతలతో కలిసి మీటింగ్స్ పెట్టి.. పెద్దరికం నెత్తిన వేసుకుని మరీ ప్రభుత్వ అనుమతులు తెచ్చి ఇలా మౌనంగా ఉండడం అందరిని ఆశ్చర్యానికి కలగజేస్తుంది.
చిరు లాంటి పెద్ద మనిషే ఇలా మౌనంగా ఉంటే.. మిగతా వారు ఎలా డేర్ చేసి సెట్స్ మీదకెళ్తారు. కానీ చిరు మాత్రం షూటింగ్ గురించి ఆలోచించడం లేదు.. కరోనా గురించి మాట్లాడడము లేదు. బాలకృష్ణ చెప్పిందే జరుగుతుంది. ఇప్పట్లో సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదని, ఇదివరికటిలా సినిమా ఇండస్ట్రీ ఉండదని.. చెప్పినట్లే జరుగుతుంది.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినా చిరు పెదవి విప్పడం లేదు. కనీసం షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో.. పెద్ద సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయో అనేది చర్చించడం లేదు. మొన్నటివరకు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులతో మీటింగ్స్ పెట్టిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎవ్వరిని కలవడం కూడా లేదు. మరి ఎందుకు ఈ మౌనం అంటూ చాలామంది చిరుని వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. చిరు అన్నీ గమనిస్తున్నాడో.. లేదంటే కరోనా కదా మనకెందుకులే అని సైలెంట్ అవుతున్నాడో.. అని అందరూ అనుకుంటున్నారు. అయితే చిరు మీటింగ్స్ పెట్టిన సమయంలో కరోనా ఉదృతి కాస్త కంట్రోల్‌లోనే ఉంది. కానీ ఒక్కసారిగా హైదరాబాద్‌లో పరిస్థితి చాలా భయంకరంగా తయారవడంతో.. చేసేది లేక ఎవరూ ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని, షూటింగ్స్ ఇప్పుడప్పుడే వద్దని, అతి తక్కువ మందితో సరైన జాగ్రత్తలు తీసుకునే వారు మాత్రమే సెట్‌పైకి వెళ్లాలని దర్శకనిర్మాతలకు చిరు సూచిస్తున్నాడట.