ఈ మధ్య తెలుగు నిర్మాతల దృష్టంతా మళయాల చిత్రాలపై పడింది. వరుసగా మళయాల చిత్రాల రీమేక్ రైట్స్ ని దక్కించుకోవడానికి ఎగబడుతున్నారు. ఈ విషయంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ముందంజలో ఉంది. నితిన్ భీష్మ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సితార ఇప్పటికే రెండు మళయాల చిత్రాల రీమేక్ హక్కులని సొంతం చేసుకుంది. అయ్యప్పనుమ్ కోషియం, కప్పెలా చిత్రాలని తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ కాబోతుంది.
అయ్యప్పనుమ్ కోషియం సినిమాలో రానా, రవితేజ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే రవితేజ స్థానంలో వెంకటేష్ నటిస్తున్నాడని అన్నారు. అయితే ప్రస్తుతం రీమేక్ ల వరుసలో ఉన్న రెండవ చిత్రం కప్పెలా తెలుగు రీమేక్ లో ఫలక్ నుమా దాస్ హీరో విశ్వక్ సేన్ నటించనున్నాడట. ఫలక్ నుమా దాస్.. హిట్.. సినిమాలతో సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న విశ్వక్ సేన్ ఖాతాలో మరో సినిమా చేరిందని అంటున్నారు.
మళయాలంలో ఈ చిత్రాన్ని మహమ్మద్ ముస్తాఫా డైరెక్ట్ చేసాడు. మరి తెలుగులోనూ మళయాల డైరెక్టర్ చే చేయిస్తారా లేదా తెలుగు దర్శకుడికి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. అయితే ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ కి అవకాశం వస్తే అతడి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నారు.