Advertisementt

బిగ్ బాస్ 4 లో కమిట్మెంట్ హీరోయిన్..?

Fri 10th Jul 2020 02:39 PM
bigg boss 4,telugu,television,ramya pasupuleti,commitment,tejaswi madivada,anveshi jain  బిగ్ బాస్ 4 లో కమిట్మెంట్ హీరోయిన్..?
Commitment heroine in Bigg Boss Season 4..? బిగ్ బాస్ 4 లో కమిట్మెంట్ హీరోయిన్..?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ గురించి వార్తలు బాగా వస్తున్నాయి. తెలుగు టెలివిజన్ పై అత్యంత పాపులారిటీ దక్కించుకున్న ఈ రియాలిటీ షో పట్ల జనాలు చాలా ఆసక్తిగా ఉన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఉండదేమో అన్న సందేహాలు వచ్చినమాట నిజమే. కానీ ప్రభుత్వం చిత్రీకరణకి అనుమతులు ఇచ్చిన కారణంగా బిగ్ బాస్ షో మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుందట. అయితే ఈ నాలుగవ సీజన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు.

మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్న కారణంగా ఈ పాటికే అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ పూర్తయిందని సమాచారం. ఇక హౌస్ లోకి కంటెస్టెంట్లుగా ఎవరు వస్తున్నారనేది అందరికీ చాలా ఆసక్తిగా ఉంది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే నలుగురు హీరోయిన్లు.. శ్రద్ధా దాస్, హంసా నందినీ, ప్రియా వడ్లమాని, యామినీ భాస్కర్ ల పేర్లు బయటకి వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం మరో హీరోయిన్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందని అంటున్నారు. లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన కమిట్మెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రమ్య పసుపులేటిని బిగ్ బాస్ బృందం సంప్రదించిందట. కమిట్మెంట్ సినిమాలో రమ్యతో పాటు తేజస్వి మాదివాడ, అన్వేషి జైన్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Commitment heroine in Bigg Boss Season 4..?:

Commitment heroine in Bigg Boss Season 4..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ