Advertisementt

రాధేశ్యామ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది..!

Sat 11th Jul 2020 04:29 PM
prabhas,radheshyam,pooja hegde,radha krishna kumar  రాధేశ్యామ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది..!
Radheshyam creating records in Social media రాధేశ్యామ్ సోషల్ మీడియాని ఊపేస్తోంది..!
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. సాహో సినిమాతో ఇక్కడ అంతగా వసూళ్ళు కలెక్ట్ చేయకపోయినా ఉత్తరాది వారిని బాగానే ఆకట్టుకుని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలని తెచ్చిపెట్టింది. దాంతో ఉత్తరాదిన ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అందరికీ అర్థమైంది. అయితే తాజాగా ప్రభాస్ 20వ చిత్రం రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులని మరింత వెయిట్ చేయించకుండా చిత్రబృందం అప్డేట్ తో ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్ లో ఈ సినిమా పూర్తి ప్రేమకథా చిత్రం అని చెప్పేసారు. అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. 

రాధేశ్యామ్ చిత్రబృందం రిలీజ్ చేసిన దాని ప్రకారం ట్విట్టర్ లో 6.3 మిలియన్లకి పైగా ట్వీట్స్, 2.8 మిలియన్ కంటే ఎక్కువ లైక్స్.. సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ 3.2 మిలియన్స్..  మొత్తానికి కలిపి 35మిలియన్స్ కి పైగా అయ్యాయి. రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది.

Radheshyam creating records in Social media:

Radheshyam creating records in Social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ