Advertisementt

మొత్తానికి విశ్వక్ సేన్‌ని ఒప్పించారు..!

Mon 13th Jul 2020 05:06 PM
oh my kadavule,telugu remake,hero vishwak sen,pvp,remuneration  మొత్తానికి విశ్వక్ సేన్‌ని ఒప్పించారు..!
Hero Vishwak Sen in Oh My Kadavule Telugu remake మొత్తానికి విశ్వక్ సేన్‌ని ఒప్పించారు..!
Advertisement
Ads by CJ

హీరోగా రెండుమూడు సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్‌కి కాస్త యాటిట్యూట్ ఎక్కువే. ఫలక్‌నుమా దాస్ విషయంలో విశ్వక్ సేన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తర్వాత నాని నిర్మాణంలో ‘హిట్’ సినిమాతో హిట్ కొట్టాక విశ్వక్ కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. అవకాశాలు కోసం వేచి చూసిన విశ్వక్ సేన్.. విజయ్ దేవరకొండలా ఫీలవుతుంటాడు. అయితే ఇప్పుడు విశ్వక్ సేన్ కండిషన్స్‌కి పీవీపీ సంస్థ సలాం కొట్టింది అనే టాక్ వినబడుతుంది. విశ్వక్ సేన్ హీరోగా పీవీపీ వారు త‌మిళ‌ సినిమా ఓ మై క‌డవులే రీమేక్ హక్కులను కొని ఆ సినిమాని రీమేక్ చేయాలనుకున్నారు. అయితే విశ్వక్ సేన్‌తో సంప్రదించగా విశ్వక్ ఆ మూవీ చెయ్యనని చెప్పేశాడు. ఎందుకంటే పారితోషకం విషయంలో వచ్చిన తేడాల వలన.

అయితే విశ్వక్ సేన్ త‌మిళ‌ ఓ మై క‌డవులే రీమేక్ చేస్తున్నాడంటూ మీడియాలో వార్తలు రావడం విశ్వక్ సేన్ దాన్ని ఖండించడం జరిగింది. ఈలోపు పీవీపీ వారు మరో హీరోతో త‌మిళ‌ ఓ మై క‌డవులేని రీమేక్ చేస్తారనుకుంటే.. కాదు మాకు విశ్వక్ సేన్ అయితేనే బావుంటుంది.. సినిమాకి క్రేజ్ వస్తుంది కాబట్టి.. మళ్ళీ పీవీపీ వాళ్ళు  విశ్వక్ ని సంప్రదించడం విశ్వక్ సేన్ అడిగిన రెండు కోట్ల పారితోషకానికి తల ఊపడం జరిగింది అని అంటున్నారు. అయితే విశ్వక్ రేంజ్ కి రెండు కోట్లు ఎక్కువే అయినా.. దర్శకుడు తరుణ్ భాస్కర్ రికమండేషన్ తో పీవీపీ వారు విశ్వక్ అడిగింది కాదనలేకుండా ఇస్తున్నారట. తరుణ్ భాస్కర్ త‌మిళ‌ ఓ మై క‌డవులేకి తెలుగు మాటలు రాస్తున్నాడు. అలాగే విశ్వక్ కి తరుణ్ తో మంచి అనుబంధం ఉంది. అలా విశ్వక్ ని త‌మిళ‌ ఓ మై క‌డవులే రీమేక్ కి పీవీపీ వారు ఒప్పించారన్నమాట.

Hero Vishwak Sen in Oh My Kadavule Telugu remake:

Oh My Kadavule Telugu remake.. Hero Vishwak Sen Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ