ప్రస్తుతం టాలీవుడ్ కాజల్ గాలి సీనియర్స్ దగ్గర బాగా వీస్తుంది. సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా కాజల్ కనబడుతుంది. శ్రియ, త్రిష లాంటి వాళ్ళు సైడ్ అవ్వగా... కుర్ర హీరోయిన్స్ సీనియర్స్ వైపు తలెత్తి చూడకపోయేసరికి చాలామంది కాజల్ నే సంప్రదిస్తున్నారు. కుర్ర హీరోల్లోనూ బెల్లంకొండ, రానా లాంటి వాళ్ళకి కాజల్ పర్ఫెక్ట్ జోడిగా తయారైంది. ఇక ఎవరైనా సినిమా నుండి తప్పుకోగానే కాజల్ ని సంప్రదించడంతో.. కాజల్ పారితోషకం విషయంలో కాస్త బెట్టుగానే ఉండేది. చేసేది లేక దర్శకనిర్మాతలు కాజల్ కి భారీగా సమర్పిస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు కాజల్ కి మరో హీరోయిన్ చెక్ పెట్టబోతోంది.
గోవా సుందరి ఇలియానాకి ఇప్పుడు స్టార్ హీరోల అవకాశాల కోసం ఎదురు చూసే ఓపిక నశించినట్టుగా కనబడుతుంది అమ్మడు వ్యవహారం. బాలీవుడ్ అవకాశాలు పోయి, బాయ్ ఫ్రెండ్‌ని వదులుకున్నాక మానసికంగా కుంగిపోయిన ఇలియానా మళ్ళీ వర్కౌట్స్‌తో మునుపటి అందాన్ని దించుతుంది. అయితే అవకాశాలు వాటంతట అవే రావు. మనమే ఓ అడుగు ముందుకు వెయ్యాలి అంటుందట ఇలియానా. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కరువు అనే పదాన్ని వాడేయ్యాలని డిసైడ్ అవడం, ఆప్షన్ లేక కాజల్ వెంట పడుతున్న దర్శకనిర్మాతలకు తాను బెస్ట్ ఆప్షన్ అంటూ సంకేతాలు పంపుతుంది. అలాగే నిర్మాతలను కూడా రీజనబుల్ రేట్స్ ఇవ్వమని అడుగుతుందట. అయితే ఇప్పటివరకు ఇలియానా సీనియర్ హీరోలతో నటించలేదు కాబట్టి.. ఇలియానాతో అయితే క్రేజ్ బావుంటుంది అని దర్శకనిర్మాతలు ఇప్పుడు తమ లిస్ట్ లో ఇలియానా పేరు చేర్చుతున్నారని ఫిలింనగర్ టాక్.