అర్జున్ సురవరం తర్వాత నిఖిల్ కార్తికేయ 2 చేస్తున్న సంగతి తెలిసిందే. నిఖిల్ కెరోర్లో మంచి హిట్ గా నిలిచిన కార్తికేయ కి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ వీడియోకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే కార్తికేయ సినిమాలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి ఇందులోనూ హీరోయిన్ గా నటిస్తుందని మొదట్లో అనుకున్నారు. కానీ ప్రస్తుతం స్వాతి పెళ్ళి చేసుకుని సినిమాలకి దూరంగా ఉండడంతో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి అనుపమ తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆమె స్థానంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిశర్మ నటిస్తుందని అంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం నుండి అధికారిక సమాచారం రానప్పటికీ అనుపమ తప్పుకుందని వినిపిస్తుంది. అనుపమ చేతిలో ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలే లేవు. అలాంటిది కార్తికేయ నుండి తప్పుకుంటుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో చిత్రబృందం స్పందిస్తేనే గానీ అసలు నిజం బయటకి రాదు.