Advertisementt

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి బర్త్‌డే స్పెషల్ పోస్టర్!

Wed 15th Jul 2020 05:01 AM
husharu fame,tej kurapati,birthday special,poster,rajadhani art movies  హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి బర్త్‌డే స్పెషల్ పోస్టర్!
Husharu Fame Tej Kurapati Film Poster Released హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి బర్త్‌డే స్పెషల్ పోస్టర్!
Advertisement
Ads by CJ

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర యూనిట్!

హుషారు ఫేమ్ తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా జి .వి .ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ నిర్మాణంలో ముల్లేటి కమలాక్షి గుబ్బల వేంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ఆహ్లాదకరమైన గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతుంది. తేజ్ కూరపాటి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ తేజ్ కూరపాటికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ‘‘హుషారు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ్ ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడా కాంప్రమైజ్ కానివ్వకుండా సినిమా తియ్యటానికి పూర్తి సహకారం అందిస్తున్నారు. మనకు తెలీకుండా మనలో ప్రేమ పుట్టినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది, ఆ ప్రేమ ఒక వ్యక్తి ద్వారా పుట్టిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్లాలనిపిస్తుందనే సస్పెన్స్ క్యూట్ లవ్ స్టోరీ ఇది..’’ అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు,  సినిమా బాగా వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతొందని తెలిపారు. 

తనికెళ్ళ భరణి, జీవ, జోగి బ్రదర్స్, కల్పనా రెడ్డి, బస్ స్టాప్ కోటేశ్వరావు, డా. ప్రసాద్, మాధవి, సునీత మనోహర్, అనంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి 

సాంకేతిక నిపుణులు :

నిర్మాతలు: ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వర రావు

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకట్ వందెల

సంగీతం: సందీప్ కుమార్

స్క్రీన్ ప్లే, లిరిక్స్: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి

కెమెరామెన్: వంశీ ప్రకాష్

ఎడిటింగ్: కె.రవికుమార్

కొరియోగ్రాఫర్: గణేష్ స్వామి, నండెపు రమేష్

స్టంట్స్: రామకృష్ణ

చీఫ్ కో డైరెక్టర్: ఎల్.రామకృష్ణం రాజు

పిఆర్‌ఓ: సాయి సతీష్

Husharu Fame Tej Kurapati Film Poster Released:

Husharu Fame Tej Kurapati birthday special poster Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ