నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. ప్రేమకథ అని తెలియజేసేలా ఫస్ట్ లుక్ ని తీర్చిదిద్దారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే 2021 లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఏ సీజన్ లో వస్తుందనేది ఆసక్తిగా మారింది.
తాజాగా ఈ విషయమై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానుందని అంటున్నారు. అయితే దీనికి వారి వాదనని కూడా జతచేస్తున్నారు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి బాహుబలి బిగినింగ్ రిలీజ్ డేట్ అయిన జులై 10వ తేదీని ఎంచుకున్న మాదిరిగానే బాహుబలి 2 రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28వ తేదీనే రిలీజ్ చేస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ డెభ్బై శాతానికి పైగా పూర్తయింది. మిగిలిన 30శాతం చిత్రీకరణకి ఎక్కువ సమయం పట్టదు. కరోనా నియంత్రణలోకి వచ్చాక స్టార్ట్ చేసినా కూడా వచ్చే వేసవి వరకి చాలా టైమ్ ఉంటుంది. అందువల్ల ఆ తేదీనే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. మరి మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో..!