డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం EST. 1975’ ఫస్ట్ లుక్‌కి అనూహ్య స్పందన
‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమై మొదటి సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించిన యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో వినూత్న సినిమాతో రాబోతున్నాడు. ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం EST. 1975’ అంటూ టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర బృందం తాజాగా హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు(జూలై 15) సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ వంటి క్యూట్ లవ్ స్టోరీలో పక్కంటి కుర్రాడులా అనిపించే రీతిన తన నటనతో ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి కాస్త రూటు మార్చి తన లుక్స్ కి మాస్ టచ్ ఇచ్చాడు. ఫస్ట్ లుక్ ని సైతం మాస్ పంధాలోనే రెడీ చేశారు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్ర యూనిట్. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆన్ లైన్ ద్వారా ఈ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. పూరీ విడుదల చేసిన అతి కొద్ది సమయంలోనే ఈ ఫస్ట్ లుక్ కి డిజిటల్ మీడియాలో అనూహ్య స్పందన లభించడం విశేషం.
ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్ డౌన్ విధించే సమయానికి కడప, రాయచోటి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేసినట్లుగా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఈ సినిమాతో శ్రీధర్ దర్శకునిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. కరోనా క్రైసిస్ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా చిత్ర తదుపరి షూటింగ్, తదితర కార్యక్రమాలు ముగించి భారీ ఎత్తున విడుదల చేయడానికి నిర్మాతలు ప్రమోద్, రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై అత్యంత ప్రామాణిక నిర్మాణ విలువలతో నిర్మాతలు ప్రమోద్, రాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తారాగణం
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జావాల్కర్, సాయికుమార్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్: ఎలైట్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాతలు: ప్రమోద్ - రాజు
కెమెరా: విశ్వాస్ డేనియల్
సంగీతం: చైతన్ భరద్వాజ్
ఏఆర్ఓ: ఏలూరు శ్రీను
దర్శకత్వం: శ్రీధర్ గాదె