Advertisementt

వకీల్ సాబ్ టీజర్ వచ్చేది ఆరోజే..!

Wed 15th Jul 2020 01:23 PM
vakeel saab,pawan kalyan,dil raju,thaman  వకీల్ సాబ్ టీజర్ వచ్చేది ఆరోజే..!
Pawan Vakeel Saab Teaser will be out on..! వకీల్ సాబ్ టీజర్ వచ్చేది ఆరోజే..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న పింక్ సినిమాని తెలుగులో వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్నారు. పింక్ సినిమాలో అమితాబ్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ పాటికే థియేటర్లలో రిలీజై ఉండేది. కానీ కరోనా కారణంగా అడ్డంకి రావడంతో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

ముగ్గురు అమ్మాయిల జీవితంలో జరిగిన సంఘటనతో కోర్ట్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ 90శాతం పూర్తయిందట. మిగతా భాగం చిత్రీకరణ జరపడానికి మరో 20రోజులు పడుతుందని అంటున్నారు. అయితే ప్రభుత్వం సినిమా షూటింగులకి అనుమతులు ఇచ్చినప్పటికీ, కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతున్న కారణంగా ఇప్పుడప్పుడే చిత్రీకరణ మొదలు కాదని సమాచారం.

అయితే 90శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం నుండి అధికారిక ఇన్ఫర్మేషన్ రానప్పటికీ ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Pawan Vakeel Saab Teaser will be out on..!:

Pawan Vakeel Saab Teaser will be out on..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ