Advertisementt

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సంపత్ నంది!

Thu 16th Jul 2020 12:52 PM
director sampath nandi,green india challenge,bhumika,digangana,urvashi rautela,sampath nandi family  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సంపత్ నంది!
Director Sampath Nandi Participates in Green India Challenge గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సంపత్ నంది!
Advertisement
Ads by CJ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన కుటుంబ సభ్యులతో కలిసి చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్లు భూమిక చావ్లా, ఊర్వశి రౌతులా; దిగాంగనా సూర్యవంశీలను ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి బాధ్యతగా అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని తెలిపారు. పద్మశ్రీ వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటాడు అని తెలిపినప్పుడు సంతోషించాను అని, అదేవిధంగా మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటాడు అని తెలిసింది. కానీ మన సంతోష్ అన్న ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉందని మన సంతోష్ అన్నకు వారికి మించిన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ వల్ల మన మూతులకు మాస్కులు కట్టుకొని తిరుగుతున్నామని, భవిష్యత్తులో మన వీపులకు ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Director Sampath Nandi Participates in Green India Challenge:

Director Sampath Nandi Challenge to Bhumika, Digangana and Urvashi Rautela

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ