Advertisementt

మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కి దర్శకుడు మారబోతున్నాడా..?

Wed 15th Jul 2020 01:37 PM
sujith,megastar chiranjeevi,lucifer  మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కి దర్శకుడు మారబోతున్నాడా..?
Will Megastar changes Director Sujith for Lucifer remake..? మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కి దర్శకుడు మారబోతున్నాడా..?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాల చిత్రమైన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. సాహో దర్శకుడు సుజిత్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పటికే సుజిత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసాడని, తెలుగు నేటివిటీకి తగినట్లుగా మార్పులు చేసాడని కూడా అన్నారు. అదీగాక ఈ సినిమాలో చిరంజీవి చెల్లిలి పాత్రలో సీనియర్ హీరోయిన్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇలాంటి అనేక రకాల ఊహాగానాల్లో తాజాగా ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. 

సాహో సినిమాతో హిట్ అందుకోలేకపోయిన సుజిత్ కి లూసిఫర్ ద్వారా మంచి అవకాశం వచ్చిందనుకునేలోపే ఆ అవకాశం చేజారిపోయిందని అంటున్నారు. లూసిఫర్ రీమేక్ పై ఇప్పటికే ఆరు నెలలు వర్క్ చేసిన సుజిత్ ని తప్పిస్తున్నారని వినిపిస్తుంది. మరి ఈ విషయంలో చిత్రబృందం స్పందించి క్లారిటీ ఇస్తేనే బాగుంటుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. 

Will Megastar changes Director Sujith for Lucifer remake..?:

Will Megastar changes Director Sujith for Lucifer remake..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ