Advertisementt

డర్టీ హరిపై వర్మ పొగడ్తలు..

Sat 18th Jul 2020 01:12 PM
dirty hari,ram gopal varma,ms raju  డర్టీ హరిపై వర్మ పొగడ్తలు..
Vama Praising Dairty Hari Film.. డర్టీ హరిపై వర్మ పొగడ్తలు..
Advertisement
Ads by CJ

వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు, మనసంతా నువ్వే వంటి క్లీన్ యు చిత్రాలని నిర్మించిన ఎమ్ ఎస్ రాజు తాజాగా దర్శకుడిగా అవతారం ఎత్తి డర్టీ హరి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించాడు. పేరులోనే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన ఎమ్ ఎస్ రాజు, ట్రైలర్ ద్వారా పూర్తిగా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం కాదని తేల్చేసాడు. క్లీన్ యు సర్టిఫికేట్ సినిమాలు తీసిన రాజు గారు ఇలాంటి సినిమా తెరకెక్కించడం చాలా మందిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అందరూ అలా ఆశ్చర్యపోతున్న టైమ్ లో రామ్ గోపాల్ వర్మ మాత్రం పొగడ్తలు కురిపిస్తున్నాడు. కరోనా టైమ్ లో సినిమాల్లాంటి సినిమాలని రిలీజ్ చేస్తూ బిజీగా ఉంటున్న వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ అనే మరో సినిమాతో వస్తున్నాడు.  అయితే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో ఇప్పటి వరకూ రిలీజ్ అయిన చిత్రాలన్నీ ఎలాంటివో మనందరికీ తెలిసిందే. అయితే తనలాగే మిగతా దర్శకులు ఫాలో అవుతున్నారని అనుకున్నాడో ఏమో గానీ, ఫిలిమ్ మేకర్ గా ఎమ్ రాజు ఎవాల్వ్ అయ్యాడని అంటున్నాడు.

శ్రావణ్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. కమెడియన్ సునీల్ ప్రధానపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఓటీటీ వేదికగా రిలీజ్ అవనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం డర్టీహరి ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది.

Vama Praising Dairty Hari Film..:

Vamar Praising Dairty Hari Film..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ