Advertisementt

విజ‌య్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌ త్వరలో..!

Sun 19th Jul 2020 10:58 AM
vijay antony,sequel,blockbuster,first look,birthday special,bichagadu movie  విజ‌య్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌ త్వరలో..!
Vijay Antony bichagadu sequel soon విజ‌య్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్‌ త్వరలో..!
Advertisement
Ads by CJ

మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ ఆంటోని.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాల‌ను ప్రేక్షకులకు అందించాల‌ని విజ‌య్ ఆంటోని భావించి ఆయ‌న నిర్మాత‌గా మారి విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.

భేతాళుడు, య‌ముడు, ఇంద్ర‌సేన‌, రోష‌గాడు, కిల్ల‌ర్ వంటి వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అలరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో జ్వాల సినిమా తెర‌కెక్కుతోంది. అంతే కాకుండా విజ‌య్ ఆంటోని నిర్మాత‌ల హీరో. నిర్మాత‌ల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని కరోనా స‌మ‌యంలో వారికి త‌న రెమ్యున‌రేష‌న్ నుండి 25 శాతం త‌గ్గించుకుని సినిమాలు చేస్తూ త‌న స‌హృద‌యాన్ని చాటుకున్నారు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, మ‌రోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విజ‌య్ ఆంటోని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అయిన ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Vijay Antony bichagadu sequel soon:

First Look Of Vijay Antony’s Highly Anticipated Sequel To His Blockbuster To Be Out On His Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ