విలక్షణ నటి సాయి పల్లవి.. గ్లామర్‌గా నటించడానికి, పొట్టి దుస్తులు వేయడానికి, అలాగే లిప్ లాక్‌లకు ఆమడ దూరంలో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలైనా కథ నచ్చి పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటుంది. అలాగే గ్లామర్ షోకి, పొట్టి దుస్తులు ధరించడానికి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. తాజాగా కూడా తాను ఎందుకు అలా నటించనో చెబుతుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల పట్ల, నా కెరీర్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. నాకొచ్చిన పాత్రలతో తృప్తిగానే ఉన్నాను, ఏదో సాధించాలి అనే ఆలోచనలు లేవు, ఆశ కూడా లేదు. నటిగా అందరికి గుర్తుండిపోయే పాత్రలు దొరికితే చాలు అంటుంది.
ఓ కథ నా దగ్గరకు వస్తే ఆ కథ నాకు సరిపోతుందా? నా హద్దులు తగ్గట్టుగా ఉందా? లేదా? అనేది చూసుకుంటాను. ఎందుకంటే నా బలము, నా బలహీనతలు నాకు తెలుసు కాబట్టి. ఇంట్లో వాళ్ళు, బయటి వారు నన్నో నటిగా చూడరు. వాళ్ళ ఇంట్లో అమ్మాయిలానే ట్రీట్ చేస్తారు. అన్ని కథలు, అన్ని పాత్రలు నాకు నప్పేయ్యవు. ఏ పాత్ర అయినా నాకు, చూసే వాళ్ళకి సౌకర్యంగా ఉందో.. లేదో.. అని ఒకటికి రెండుసార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటాను. కురచ దుస్తులతో నేను సౌకర్యంగా ఉండలేను. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత కూడా నా పిల్లలు నా సినిమా చూసి సంతోషపడాలి. అలాగే నా పేరెంట్స్ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలి. అందుకే గ్లామర్ షోకి, లిప్ లాక్స్‌కి నేను దూరం అని అంటుంది సాయి పల్లవి.