Advertisementt

అభిమానులని నిరాశపరిచిన సూర్య..

Sun 19th Jul 2020 03:30 PM
surya,akasam nee hadduraa,sudha kongara  అభిమానులని నిరాశపరిచిన సూర్య..
fans disappointed by the suryas decision అభిమానులని నిరాశపరిచిన సూర్య..
Advertisement
Ads by CJ

తమిళ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అయ్యే సూర్య సినిమాలకి మంచి డిమాండ్ ఉండేది. అయితే గత కొన్ని రోజులుగా తెలుగులో సూర్య మార్కెట్ తగ్గుకుంటూ వస్తుంది. గ్యాంగ్ సినిమా మొదలుకుని మొన్న రిలీజ్ అయిన బందోబస్త్ చిత్రాలకి సరైన రెస్పాన్స్ రాలేదు. అయితే ప్రస్తుతం సుధకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆకాశం నీ హద్దురా సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై నమ్మకాన్ని పెంచింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలకి కూడా మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఆకాశం నీ హద్దురా సినిమా ట్రైలర్ విడుదల కానుందని, జులై 23వ తేదీన సూర్య పుట్టినరోజుని పురస్కరించుకుని ట్రైలర్ రిలీజ్ చేస్తారని భావించారు. అయితే ప్రస్తుతం ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. సూర్య పుట్టినరోజున ఆకాశం నీ హద్దురా సినిమా నుండి అప్డేట్ వస్తుందట. కానీ అది ట్రైలర్ కాదట.

నిమిషం నిడివి కలిగిన కాటుక కనులే అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది కూడా. అయితే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో అని భావించిన అభిమానులకి పాటతో సరిపెడతామని చెప్పడంతో కొంత నిరాశకి గురయ్యారు. అపర్ణ మురళీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సూర్య, బాలీవుడ్ నిర్మాత గునీత్ మోంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

fans disappointed by the suryas decision :

fans disappointed by the suryas decision 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ