Advertisementt

బ్లఫ్ మాస్టర్ దర్శకుడిపై చిరు ప్రశంసలు..

Sun 19th Jul 2020 05:07 PM
megastgar chiranjeevi,bluff master,satyadev,gopi ganesh  బ్లఫ్ మాస్టర్ దర్శకుడిపై చిరు ప్రశంసలు..
Megastar praises Bluff Master director బ్లఫ్ మాస్టర్ దర్శకుడిపై చిరు ప్రశంసలు..
Advertisement
Ads by CJ

టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ చిరంజీవి, తాజాగా బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీగణేష్ పై ప్రశంసలు కురిపించాడు. 2018లో రిలీజ్ అయిన బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని ఇటీవల చూసిన మెగాస్టార్ దర్శకుడు గోపీగణేష్ ని ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు బాగున్నాయనీ, కొన్ని డైలాగులని తననోటి ద్వారా వినిపించాడట.

దాంతో డైరెక్టర్ గోపీగణేష్ నోటమాటరాకుండా కూర్చుండిపోయాడట. మెగాస్టార్ చిరంజీవి తన సినిమా గురించి, అందులోని డైలాగులని గుర్తుంచుకుని మరీ చెబుతుంటే డైరెక్టర్ కి చాలా సంతోషాన్ని కలిగించిందట. అంతే కాదు ఆ సినిమాలోని తనకి నచ్చిన ఫేవరేట్ సీన్స్ , గోపీగణేష్ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకుంటూ గంటకి పైగానే మాట్లాడుకున్నారట. ముఖ్యంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ హీరోగా తీసుకోవడం మంచి ఛాయిస్ గా చెప్పుకొచ్చాడట. 

బ్లఫ్ మాస్టర్ చిత్రం థియేటర్లో సరిగ్గా ఆడలేదు. అయినా కూడా మెగాస్టార్ ఈ చిత్ర డైరెక్టర్ ని పిలిపించుకుని మరీ డిస్కస్ చేయడం, దర్శకుడిగా గోపీగణేష్ ఎన్నో మెట్లు ఎక్కినట్టేనని చెప్పుకుంటున్నారు.

Megastar praises Bluff Master director:

Megastar praises Bluff Master director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ