పూరి - ఛార్మి నిర్మాతలుగా పూరి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఛార్మి మట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ ఏడాది సెలెబ్రేషన్స్ ఏం చెయ్యడం లేదని చెబుతుంది. ఇక తాము కష్టాల్లో ఉండగా. పదేళ్లకు వచ్చిన మొట్టమొదటి హిట్ ఇస్మార్ట్ శంకరే అంటుంది. అందుకే ఇస్మార్ట్ హిట్ మాకెంతో ప్రత్యేకం అంటుంది. ఇక లాక్ డౌన్ సమయంలో పూరి జగన్నాధ్ ఖాళీగా లేరని.. నాలుగు నెలలుగా కథలు రాస్తూ గడిపేస్తున్నారని చెప్పిన ఛార్మి.. మరో పదేళ్లవరకు తమకు సినిమాల కోసం కథల కరువు లేదని చెబుతుంది. ఇక తనకి నటించే ఉదేశ్యం లేదని.. పూర్తిస్థాయి నిర్మాతగానే ఉంటాను అని చెప్పింది.
అయితే పూరి కనెక్ట్స్ నుండి ఇక నుండి తెరకెక్కే మూవీస్ అన్ని పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతాయని.. పాన్ ఇండియా లెవల్లోనే నిర్మిస్తామని.. ఇక నుండి పూరి కనెక్ట్స్ పై వరసగా సినిమా ప్రకటనలు ఉండబోతున్నాయంటూ చెప్పింది ఛార్మి. కేవలం థియేట్రికల్ కంటెంట్ మాత్రమే కాదు.. ఓటిటి లకు తగ్గ కథలను సిద్ధం చేస్తున్నాం, పూరి జగన్నాధ్ నుండి చాలా స్క్రిప్ట్స్ రాబోతున్నాయని, వాటి కోసం కొత్త దర్శకులను వాళ్ళ టాలెంట్ ని ప్రోత్సహించాలని ఆనుకుంటున్నామని చెబుతుంది ఛార్మి. ఇక ఇస్మార్ట్ అవకాశం ఇచ్చిన రామ్ అంటే పూరి కి చాలా ఇష్టం. మళ్ళీ రామ్ తో మరోసారి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెబుతుంది.