Advertisementt

బాసూ.. ఈ కొత్త లుక్ ఏంటీ?

Tue 21st Jul 2020 06:06 PM
megastar chiranjeevi,new look,bluff master movie,director gopi ganesh,praises  బాసూ.. ఈ కొత్త లుక్ ఏంటీ?
Chiranjeevi New Look Creates sensation బాసూ.. ఈ కొత్త లుక్ ఏంటీ?
Advertisement
Ads by CJ

ఇప్పుడు కరోనా కారణంగా చాలామంది గెడ్డాలు, మీసాలు పెంచేసి గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా అన్‌లాక్ 3.0 స్టార్ట్ అయినా చాలామంది గెడ్డం, మీసం లుక్‌లో నుండి బయటికి రావడం లేదు. అల్లు అర్జున్ అయితే పుష్ప కోసం అయినా మేకోవర్‌తోనే ఇప్పటికి అదే లుక్‌ని మెయింటైన్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండ కూడా పూరి సినిమా కోసం పెంచిన జుట్టుని అలాగే ఉంచాడు కానీ.. కొత్త లుక్ లోకి రాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఆచార్య లుక్ లో నుండి కొత్త లుక్ లోకి మారిపోయాడు. ఆచార్యలో మంచి మీసకట్టుతో క్లీన్ షేవ్ తో కనబడుతున్న చిరు కరోనా లాక్ డౌన్ మూడు నెలలు ఒకే లుక్ మెయింటైన్ చేసాడు.

అయితే ఇప్పుడప్పుడే సినిమా సెట్స్ మీదకెళ్లేలా లేదు. అంటే చిరు కూడా ఇంట్లోనే ఉంటూ లాక్ డౌన్ లో సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అయితే చిరు ఎప్పటిలాగే నార్మల్ గా మీసకట్టు, చిరు గెడ్డంతో ఉంటాడనుకుంటే.. చిరు తాజా లుక్ అందరికి షాకిస్తుంది. చిరంజీవి తాజాగా బ్లఫ్ మాస్టర్ దర్శకుడిని తన ఇంటికి పిలిపించి అభినందించే కార్యక్రమంలో బయటికి వచ్చిన ఫొటోలో చిరు క్లీన్ షేవ్, అలాగే మీసం తీసేసి కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా లాక్ డౌన్ జిమ్‌లో పొట్ట కూడా బాగా తగ్గించి చాలా స్లిమ్ లుక్ లో కనబడుతున్నాడు చిరు. చిరు కొత్త లుక్ చూడగానే లాక్ డౌన్ షాక్ అంటూ మెగా ఫ్యాన్స్ చిరు లుక్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి బాసు ఈ కొత్త లుక్కు అంటూ సోషల్ మీడియాలో చిరుని ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరి చిరు ఈ కొత్త లుక్ దేనికోసమో..!

Chiranjeevi New Look Creates sensation:

Megastar Praises ‘Bluff Master’ Director Gopi Ganesh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ