బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. మూడు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ రెడీ అవుతోంది. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యం అధికారిక ప్రకటన కూడా చేసింది. అయితే బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
టాలీవుడ్ హీరోయిన్లు అయిన శ్రద్ధా దాస్, హంసా నందినీ, యామినీ భాస్కర్ ల పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో సెలెబ్రిటీ పేరు గట్టిగా వినిపిస్తోంది. బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ కలిగించడానికి వివిధ రంగాలకి చెందినవారిని కంటెస్టెంట్లుగా తీసుకుంటారు. అందుకే ఒక సింగర్, ఒక డాన్సర్, ఇంకా సోషల్ మీడియా స్టార్స్, మొదలగు డిఫరెంట్ క్యాటగిరీకి చెందినవారిని ఒకచోట చేర్చడానికి చాలా ఇష్టపడతారు.
అందులో భాగంగానే బిగ్ బాస్ యాజమాన్యం డాన్స్ మాస్టర్ రఘుని కంటెస్టెంట్ గా తీసుకుందట. రఘు మాస్టర్ ఎన్నో చిత్రాలకి కొరియోగ్రఫీ చేసాడు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే ఈ మాస్టర్ ఇప్పుడు తనదైన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడని సమాచారం. చూడాలి మరి ఏం జరగనుందో..!