Advertisementt

రెడ్ కార్పెట్ రీల్ వారి ‘Bకామ్ లో ఫిజిక్స్’

Wed 22nd Jul 2020 08:07 AM
sam j chaitanya,new film title,b com lo physics,bcom lo physics,movie title  రెడ్ కార్పెట్ రీల్ వారి ‘Bకామ్ లో ఫిజిక్స్’
Sam J Chaitanya New Film Title Announced రెడ్ కార్పెట్ రీల్ వారి ‘Bకామ్ లో ఫిజిక్స్’
Advertisement
Ads by CJ

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వంలో వ‌స్తున్న మ‌రో చిత్రానికి ‘Bకామ్ లో ఫిజిక్స్’ అనే టైటిల్‌ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్టి యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డంలో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే ద‌ర్శ‌కుల్లో ఈ మ‌ద్య‌కాలంలో శ్యామ్ కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌డు చాలా ఫేమ‌స్ టైటిల్ ని Bకామ్ లో ఫిజిక్స్ అంటూ చిత్రాన్ని నిర్మించారు. 80 శాతం సిని‌మా పూర్త‌య్యింది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో హిందీ, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హిందీలో కూడా టైటిల్‌గా క్రేజి టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. ఈ వారంలో ఆ టైటిల్‌తో పాటు రెండు భాష‌ల ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేస్తున్నారు. ఏడుచేప‌ల క‌థ చిత్రంలో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధి పై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లంని చాలా బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేయటానికి సిధ్ధ‌మయ్యాడు. ఈ చిత్రం ఏడుచేప‌ల క‌థ కంటే మూడింత‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటుంద‌ని యూనిట్ చాలా బ‌లంగా చెప్తున్నారు.

 

న‌టీన‌టులు.. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు..

ఈ చిత్రానికి కెమెరా: ఆర్లి

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: స్వాధిన్ శ‌ర్మ‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: పెరుమాళ్ మ‌లినేని

సంగీతం.: ఏకె రిషాల్ సాయి, ఎం టి క‌విశంక‌ర్‌

ఎడిట‌ర్‌: శ్యాంస‌న్

సౌండ్ డిజైన‌ర్‌: వ‌న‌జ‌కేశ‌వ్ స్టూడియో

సౌండ్ మిక్సింగ్‌: క‌వి స్టూడియో జెర్మ‌ని

క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: శ్యామ్ జే చైత‌న్య‌

Sam J Chaitanya New Film Title Announced:

B.com lo Physics is the Sam J Chaitanya New Film Title 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ