‘అండ్ ఎంగేజ్డ్’ అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేశారు హీరో నితిన్. తన దీర్ఘకాల స్నేహితురాలు షాలినితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్న ఫొటోలను షేర్ చేశారు. హైదరాబాద్‌లోని నితిన్ నివాసంలో నితిన్, షాలిని నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ సందర్భంగా షాలిని వేలికి ఉంగరం తొడిగారు నితిన్. ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
నితిన్ క్రీమ్ కలర్ సంప్రదాయ కుర్తా పైజమా ధరించగా, షాలిని బంగారు రంగు పట్టుచీర, ఎరుపు రంగు బ్లౌజ్‌లో మెరిసిపోయారు. నితిన్, షాలిని వివాహ వేడుక జూలై 26 రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనున్నది. ఈ వివాహానికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఇరు కుటుంబాల వారు ఆహ్వానించారు.