నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ పుట్టినరోజు జులై 25. నటుడుగా గత ఏడాది షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1931లో తొలి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదల అయితే.. 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. 1959లో ఆయన నటించిన ‘సిపాయి కూతురు’ విడుదలైంది. ఇప్పటికి నటుడిగా 61 సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ ఏడాది జులై 25కి 85 సంవత్సరాలు నిండాయి.
నవరస నటనా సార్వభౌమ సత్యనారాయణ 86వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో తనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు చిత్ర పరిశ్రమకు నుంచి తనకు బర్తడే విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అలాగే మీడియావారితో పాటుగా నన్ను అభిమానించే అభిమానులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.