Advertisementt

అనుష్క సినిమాలో విజయ్ సేతుపతి..?

Sun 26th Jul 2020 04:07 PM
anushka,vijay sethupathi,nissabdam,al vijay  అనుష్క సినిమాలో విజయ్ సేతుపతి..?
Vijay Sethupathi in Anushkas next film..? అనుష్క సినిమాలో విజయ్ సేతుపతి..?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలని ఒప్పుకుంటూ వస్తుంది. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క, ఆ తర్వాత కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  కరోనా కారణంగా నిశ్శబ్దం సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసుకుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే రెండు సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

అయితే అదలా ఉంచితే అనుష్క తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే లైన్లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా ఏఎల్ విజయ్ పేరు కూడా ఆ లిస్టులో చేరింది. కొన్ని రోజుల క్రితం విజయ్ కథ వినిపించాడని, అందులో నటించడానికి అనుష్క ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఒకానొక ఇంపార్టెంట్ పాత్రలో తమిళ హీరో విజయ్ సేతుపతి నటించనున్నాడట. అతిథి పాత్ర కంటే ఎక్కువ పరిధి కలిగిన ఈ పాత్రలో అనుష్కతో పాటు తెరని పంచుకోనున్నాడట. మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుందట.

Vijay Sethupathi in Anushkas next film..?:

Vijay Sethupathi in Anushkas next film..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ