Advertisementt

కొరటాల, బన్నీ కాంబోలో.. బన్నీ పాత్ర ఇదేనా?

Wed 29th Jul 2020 09:08 AM
allu arjun,student leader,koratala siva,bunny  కొరటాల, బన్నీ కాంబోలో.. బన్నీ పాత్ర ఇదేనా?
Allu Arjun Role in Koratala Siva Film కొరటాల, బన్నీ కాంబోలో.. బన్నీ పాత్ర ఇదేనా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌తో పుష్ప సినిమాతో సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది.. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే అల్లు అర్జున్ - సుకుమార్‌లు కరోనా ఉధృతి ముగిస్తే సెట్స్ మీదకెళదాం అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో అల్లు అర్జున్ చాలా కథలు విన్నాడని... లాక్‌డౌన్ కావడంతో చాలామంది దర్శకులు తమ దగ్గర ఉన్న కథల కోసం హీరోలను ఎంచుకుని వాళ్ళకి ఫోన్‌లో కథ వినిపించి ఒకే చేయించుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం మెగా కాంపౌండ్‌లో చిరుతో ఆచార్య చేస్తున్న కొరటాల లాక్‌డౌన్ లోనే అల్లు అర్జున్‌కి ఓ కథ చెప్పి ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. ఇక కొరటాలతో అల్లు అర్జున్ సినిమా అంటే అంచనాలకు అందదు. కొరటాల సామాజిక అంశాల మేళవింపు... అల్లు అర్జున్ డాన్స్, కామెడీ, నటన, యాక్షన్.. ఇలా అన్ని విషయాల్లో వారిది సూపర్ కాంబో.

అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ డాన్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి అన్నీ పీక్స్ లో ఉన్న సినిమాలే వచ్చాయి. మరి అలాంటప్పుడు కొరటాల శివ అల్లు అర్జున్‌ని తన సినిమాలో ఎలా చూపిస్తాడో అనే క్యూరియాసిటిలో ఫాన్స్ ఉన్నారు. అయితే సోషల్ మీడియా కథనం ప్రకారం అల్లు అర్జున్‌ని కొరటాల తన సినిమాలో ఓ స్టూడెంట్ లీడర్‌గా చూపించబోతున్నట్టుగా న్యూస్. విద్యార్థి నాయకుడిగా అల్లు అర్జున్‌ని చూపించబోతున్నాడని అంటుంటే, మరి విద్యార్థి నాయకుడిగా అల్లు అర్జున్.. సమాజానికి ఎలా ఉపయోగపడతాడో.. కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడన్నమాట. ఇక అల్లు అర్జున్ - కొరటాల కాంబో పక్కా అని అంటున్నారు. మరి అల్లు అర్జున్ లోని మాస్ అండ్ కామెడీ చూసిన వారంతా.. స్టూడెంట్ లీడర్‌గా ఎలా ఉంటాడో చూసెయ్యాలి అనేంతగా అప్పుడే ఈ కాంబోపై కామెంట్స్ పడుతున్నాయి. 

Allu Arjun Role in Koratala Siva Film:

Allu Arjun Student Leader in Koratala siva film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ