ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్‌ని పక్కనబెట్టి ఎంచక్కా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో హీరోలకు కావాల్సిన ఖాళీ టైం దొరకడంతో.. ఫామిలీస్ కి ఫుల్ టైం కేటాయించేసి.. ఫ్యామిలీతో బోర్ కొట్టేవరకు గడిపిస్తుంది కరోనా. కరోనా ఎప్పుడు ముగియాలి, ఎప్పడు షూటింగ్‌కి వెళ్ళాలి అన్నట్టుగా ఉన్నారు హీరోలు. ఇక ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఒకటి కమిట్ అవడంతో పాటు ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాని ఓకే చేసుకున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబులా ఓ నిర్మాణ సంస్థని కూడా మొదలెట్టబోతున్నాడు. అన్న కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉన్నప్పటికీ.. మరో నిర్మాణ సంస్థని ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్.. తండ్రి, కొడుకు పేరు కలిసొచ్చేలా భార్గవ్ హరి అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించబోతున్నాడు.
అయితే ఎన్టీఆర్ తన మామగారైన నార్నె శ్రీనివాస్‌కి ఉన్న ఓన్ టివి ఛానల్‌కి కొత్తగా మెరుగులు దిద్ది దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ అందించే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాడట. చిన్నసినిమాల సంగతి అలా ఉంచి.. తన టీం తో ఎన్టీఆర్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని తయారు చేస్తాడట. ఆ ఎంటెర్టైమెంట్ ప్రోగ్రామ్స్ ని తన ఫ్రెండ్ రాజీవ్ కనకాల, ఆయన భార్య సుమ ఆధ్వర్యంలో అందించేలా ప్లాన్ చెయ్యడమే కాకుండా.. యాంకర్ అనసూయని హాట్ యాంకర్‌గా తన ఛానల్ లో కట్టిపడేయ్యాలని ఎన్టీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు. సుమ ద్వారా అనసూయని ఎన్టీఆర్ టీం సంప్రదించినట్లుగా టాక్. అనసూయకి కేవలం యాంకరింగ్ బాధ్యతలే కాకుండా ఇంకా కీలక బాధ్యతలు కూడా అప్పజెప్పి.. భారీ పారితోషకం ఇవ్వాలని చూస్తున్నారట. ఇక ఈ ఛానల్ కొత్తగా ముస్తాబు చెయ్యడానికి గాను ఎన్టీఆర్ ఏకంగా 100 కోట్లు వరకు ఖర్చు పెట్టబోతున్నాడట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ఛానల్ ద్వారా కొత్తకొత్త ప్రోగ్రామ్స్ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని టాక్.