త్రివిక్రమ్ లాంటి దర్శకుడే హీరోయిన్స్ అందం మీద ఫోకస్ పెట్టి.. వాళ్ళకి నటనకి ప్రాధాన్యత లేని గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తున్నారు. కథలో హీరో హీరోయిజం తప్ప హీరోయిన్ గ్లామర్ కి పెద్ద పీట వేస్తూ వాళ్లలో నటనను చాలామంది దర్శకులు మరుగున పడేలా చేస్తున్నారు. త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజా హెగ్డే గ్లామర్‌నే నమ్ముకున్నాడు. అల వైకుంఠపురములో అయితే పూజా హెగ్డే కాళ్ళ మీదే ఫోకస్ పెట్టి మరీ ఆమెని గ్లామర్ షో చేయించాడు. కేరెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేదు. ఇక తాజాగా పూజా హెగ్డే మరోసారి గ్లామర్ రోల్ తోనే హైలెట్ కాబోతుంది. మూడు వరస ప్లాప్స్ పడ్డాయి. అయినా ప్లాప్ దర్శకుడితో సినిమా చేసిన అఖిల్ ధైర్యం పూజా హెగ్డేనే. పూజా హెగ్డే టాలీవుడ్ టాప్ హీరోయిన్.
ఆమె అందాలకు యూత్ పడి చచ్చిపోతారు. అందుకే అఖిల్ ఆఖరుకి పూజా గ్లామర్‌నే నమ్ముకున్నాడు. ఇక ఎప్పటిలా బొమ్మరిల్లు భాస్కర్ ఏమైనా పూజాకి నటించే స్కోప్ ఇచ్చి ట్రెడిషనల్‌గా చూపిస్తాడనుకుంటే భాస్కర్ కూడా పూజా హెగ్డే గ్లామర్‌నే నమ్ముకున్నాడు. కరోనా రొమాంటిక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లుక్‌లో పూజా తన హాట్ హాట్ కాళ్లతో అఖిల్ ని తాకుతుంది. ఈ పోస్టర్ బయటకు వచ్చినప్పటి నుంచీ.. పూజా కాళ్ల గురించీ, గ్లామర్ గురించి మాట్లాడుకోవడం మొదలైంది. అఖిల్ గురించి ఎక్కడా మట్లాడడం లేదు.. కేవలం పూజా గ్లామర్ పైనే అందరి ఫోకస్. పూజా హెగ్డే గ్లామర్ ముందు అఖిల్ తేలిపోయాడనే కామెంట్స్ పడుతుంటే.. హీరోయిన్స్ కి, వారి కేరెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే బొమ్మరిల్లు భాస్కర్ కూడా చివరికి హీరోయినా అందాలనే నమ్ముకోవాల్సి వచ్చింది అని అంటున్నారు. మరి పూజా అందాలే కావొచ్చు, బొమ్మరిల్లు భాస్కర్ మేకింగ్ కావచ్చు.. సినిమా హిట్ అయితే చాలు.. అఖిల్ పైకి లేస్తాడు. లేదంటే లేదు.