బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అనుష్క, ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలనే ఒప్పుకుంటుంది ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో ఓటీటీ ద్వారా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ సినిమా అనంతరం అనుష్క నటించబోయే సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ కి డిమాండ్ చాలా పెరిగింది. అందువల్ల పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లని రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. అయితే అనుష్క ప్రధాన పాత్రలో వెబ్ సిరీస్ ని రూపొందించడానికి అంతర్జాతీయ ఓటీటీ వేదిక ప్లాన్ చేసినట్టుగా సమాచారం. బాహుబలితో టాప్ పొజిషన్ లోకి చేరిన అనుష్క అయితే పాన్ ఇండియా రేంజ్ లో మంచి బలం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ సిరీస్ ని రూపొందించాలని ప్లాన్ చేసారట.
అయితే అనుష్క ఆ సిరీస్ లో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఆమె తర్వాతి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ, అనుష్క సిరీస్ లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించలేదట. మరి అనుష్క తన తర్వాతి స్టెప్ ఎటువైపు తీసుకుంటుందో చూడాలి.