Advertisementt

ఆర్జీవీ మరో మూవీ.. చిరును టచ్ చేస్తాడట!

Fri 31st Jul 2020 10:06 AM
rgv,ramgopal varma,rgv movies,mega family,chiranjeevi,uday kiran biopic,director teja  ఆర్జీవీ మరో మూవీ.. చిరును టచ్ చేస్తాడట!
Again RGV Touches mega family with biopic! ఆర్జీవీ మరో మూవీ.. చిరును టచ్ చేస్తాడట!
Advertisement
Ads by CJ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్‌లోనూ సినిమాలు తీస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘న‌గ్నం’, ‘పవర్ స్టార్’ చిత్రాలను ఓటీటీలో వదిలాడు. ఇంకా నాలుగైదు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఇప్పటికే ‘పవర్ స్టార్’ సినిమాతో మెగా ఫ్యామిలీని టచ్ చేసిన ఆర్జీవీ.. త్వరలోనే మరో వివాదాస్పద సినిమాతో ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే టచ్ చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేమిటంటే.. యంగ్ హీరో ఉదయ్ కుమార్ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఉదయ్ బయోపిక్ తీస్తారని తెలియవచ్చింది. ప్రస్తుతం యంగ్ హీరోను పోలిన వ్యక్తిని వెతికే పనిలో ఆర్జీవీ అండ్ క్రూ నిమగ్నమైందట.

బయోపిక్‌లో ఏమేం ఉంటాయ్!?

ఉదయ్ కిరణ్ ఒక్కో సినిమాతో తన క్రేజ్‌ను పెంచుకున్నాడో.. అంతే రీతిలో ఒక్కసారిగా ఢీలా పడిపోయి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని కొన్ని ఘటనలు ఆత్మహత్యకు దారి తీశాయి. అయితే ఇందుకు కారణాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా.. కనీసం ఇప్పటికీ అసలు కారణాలు మాత్రం కుటుంబీకులు కూడా చెప్పట్లేదు. ఉదయ్ కిరణ్ మీద ఇంకా ఇలా పలువురి మీద అనుమానాలు, ఆరోపణలు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉదయ్ ఆత్మహత్యకు సినిమా ఛాన్స్‌లు లేకపోవడమేనని.. మోగా ఫ్యామిలీ మరీ ముఖ్యంగా చిరంజీవే ఆయన్ను తొక్కేశారనే ఆరోపణలు నాటి నుంచి నేటి వరకూ ఉన్నాయ్. అంతేకాదు.. హీరో అంత్యక్రియల్లో మెగా ఫ్యామిలీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు మార్మోగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

తేజను కూడా..!?

అలా మెగాస్టార్ కుమార్తెను ఉదయ్ కిరణ్‌ ఇవ్వాలనుకోవడం, ఆ తర్వాత జరిగిన కొన్ని కొన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారం మొత్తమ్మీద చిరును కూడా టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. కాగా.. ఈ బయోపిక్‌ కోసం ఆర్జీవీ తన శిష్యుడు తేజ సాయం తీసుకోనున్నాడట. ఎందుకంటే ఉదయ్ కిరణ్‌ను పరిచయం చేసింది.. అంత స్టార్‌డమ్ తెచ్చింది ఆయనే. ఆయన వ్యక్తిగత విషయాలు మొదలుకుని సినీ కెరీర్ గురించి తేజ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో. ఉదయ్ సక్సెస్‌ను కాకుండా ఆయన లైఫ్‌లో జరిగిన కాంట్రవర్సీని మాత్రమే టచ్ చేయాలని అనుకుంటున్నాడట. మొత్తానికి చూస్తే తన వివాదాస్పద సినిమాలోకి తేజను కూడా ఆర్జీవీ లాగుతున్నాడన్న మాట. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ‘పవర్ స్టార్’ సినిమాతో పవన్ కల్యాణ్‌ను ఉదయ్ బయోపిక్‌తో మెగాస్టార్‌ను టచ్ చేస్తున్నాడన్న మాట. అటు చేసి ఇటు చేసి ఆర్జీవీ మాత్రం మెగా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.

Again RGV Touches mega family with biopic!:

Again RGV Touches mega family with biopic!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ