ఎన్టీఆర్ RRR తర్వాత త్రివిక్రమ్‌తో సినిమాకి కమిట్ అయ్యాడు. త్రివిక్రమ్ అంటే కామెడీ.. పంచ్ డైలాగ్స్ వగైరా వగైరా కామన్. కానీ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మొదటిసారి ఓ మాస్ సినిమా చేశాడు. అది అరవింద సమేత వీర రాఘవ సినిమా. అది త్రివిక్రమ్ స్టయిల్ కి పూర్తి విరుద్ధంగా తీసిన సినిమా. మాస్ మసాలాతో ఎన్టీఆర్ కి సరిపోయే సినిమా చేసాడు. అది సోసోగా ఆడింది. తర్వాత అల్లు అర్జున్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా చేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. మళ్లీ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మూవీ అనేసరికి ఆ సినిమా నేపథ్యం అది ఇది అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు చక్కర్లు కొట్టాయి. పొలిటికల్ బ్యాగ్ డ్రాప్‌లో త్రివిక్రమ్ - ఎన్టీఆర్ మూవీ ఉంటుంది అని అందుకే దానికి సరిపోయే టైటిల్‌గా అయినను పోయిరావలె హస్థినకు అనే టైటిల్ కూడా ప్రచారం లోకొచ్చింది.
ఇక ఎన్టీఆర్ ఓ బిజినెస్ మ్యాన్‌గా విదేశాల్లో ఉంటాడని.. కానీ అనుకోకుండా ఇండియా వచ్చి రాజకీయాల్లో అడుగుపెడతాడని ఏవేవో కథలు ప్రచారంలోకొచ్చాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా బ్యాగ్డ్రాప్ లో ఎలాంటి రాజకీయాలు ఉండవని, అసలు పొలిటికల్ డైలాగ్స్ కూడా సినిమాలో ఉండవని, ఈ సినిమా మొత్తం కామెడీతో పక్కా ఎంటెర్టైనెర్ గా ఉండబోతుంది అని.. అలాగే ఎన్టీఆర్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్ గా కనబడతాడని, ఒక పురాతన పాడు బడిన కోటలోని గుప్త నిధుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోందని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా నేపథ్యం ఏమో కానీ.. ఆ సినిమా బ్యాగ్ డ్రాప్ పై సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు మాత్రం హల్చల్ చేస్తున్నాయి.