Advertisementt

బిగ్ బాస్: కింగ్ నాగార్జునని టార్గెట్ చేస్తున్నారు

Wed 05th Aug 2020 07:52 AM
bigg boss,film shoot,nagarjuna,bigg boss promo,king nagarjuna,host  బిగ్ బాస్: కింగ్ నాగార్జునని టార్గెట్ చేస్తున్నారు
Why Nagarjuna Accepted To Do Bigg Boss 4? బిగ్ బాస్: కింగ్ నాగార్జునని టార్గెట్ చేస్తున్నారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో హీరోలంతా షూటింగ్స్ లేవు... సినిమాలు లేవు అంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలు లబోదిబో మంటున్నా కరోనా వస్తే కష్టం.. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు అంటూ హీరోలు మాత్రం ఇల్లు దాటి బయటికి రావడం లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు సినిమా షూటింగ్స్ జరగవని చాలామంది హీరోలు చెప్పకనే చెబుతున్నారు. అందులో నాగార్జున కూడా ఉన్నాడు. షూటింగ్స్ అనుమతుల కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాల చుట్టూ తిరిగిన చిరు అండ్ నాగార్జునలు కరోనాకి భయపడి షూటింగ్స్ కి వెళ్లడం లేదు. అయితే సినిమా షూటింగ్స్ కి వెళ్ళడానికి కరోనా అంటూ భయపడుతున్న నాగార్జున ఇప్పుడు బిగ్ బాస్ షూటింగ్ కి ఎలా హాజరవుతున్నారు అనే టాక్ ఫిలింనగర్‌లో రైజ్ అయ్యింది.

సినిమా షూటింగ్స్‌కి కరోనా అడ్డం పడింది. కానీ బిగ్ బాస్ షూటింగ్‌కి కరోనా భయం లేదా? కరోనాతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినిమా షూటింగ్స్ చెయ్యడానికి సాహసం చెయ్యని నాగార్జున ఇప్పుడు బుల్లితెర కోసం బిగ్ బాస్ ప్రోమో షూట్‌లో పాల్గొనడమే కాదు.. బిగ్ బాస్ వారాంతం ఎపిసోడ్స్ షూట్‌కి హాజరు కానున్నాడు. అందుకే సినిమాల షూటింగ్ కి ఒక లెక్క, బుల్లితెర షూటింగ్ కి ఒక లెక్కా.. అదేమిటి నాగ్ దానికో న్యాయం, నీకో న్యాయమా అంటున్నారు చాలామంది. ఇక నాగార్జునతో సినిమా చేస్తున్న వైల్డ్ డాగ్ నిర్మాతలైతే నాగ్ చేస్తున్న పనికి కాస్త ఆగ్రహంగానే ఉన్నారు. కానీ నాగార్జున లాంటి హీరోతో పెట్టుకోవడం ఎందుకులే అని కిమ్మనకుండా ఉండిపోయారట.

Why Nagarjuna Accepted To Do Bigg Boss 4?:

Why Bigg Boss, Why Not Film Shoot?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ