Advertisementt

రామ్ చరణ్, మహేష్.. నెక్స్ట్ ఎవరు?

Sat 08th Aug 2020 08:57 PM
heroes,ram charan,mahesh babu,mythri movie makers,lokesh kanagaraj  రామ్ చరణ్, మహేష్.. నెక్స్ట్ ఎవరు?
Gossips on Mythri Movie Makers and Lokesh Kanagaraj combo రామ్ చరణ్, మహేష్.. నెక్స్ట్ ఎవరు?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ RRR తర్వాత మరో మూవీకి కమిట్ కాకపోయేసరికి.. రామ్ చరణ్ లాక్‌డౌన్‌లో కథలు వింటున్నాడు. అదిగో ఆ దర్శకుడితో రామ్ చరణ్ నెక్స్ట్.. ఇదిగో రామ్ చరణ్ నెక్స్ట్  ఆ దర్శకుడితో సినిమా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం.. నిన్నగాక మొన్న మైత్రి మూవీస్ వారు తమిళ దర్శకుడు ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా రామ్ చరణ్‌తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారని.. ఆచార్య, RRR తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్‌తో సినిమా చెయ్యొచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. లోకేష్ కథతో మెప్పిస్తే రామ్ చరణ్ లోకేష్‌తో సినిమా పక్కా చేస్తాడనే టాక్ నడిచింది.

అయితే తాజాగా రామ్ చరణ్‌తో కాదు.. మైత్రి మూవీస్ వారు లోకేష్ కనగరాజ్‌తో మహేష్ బాబు హీరోగా మూవీ ప్లాన్ చేస్తున్నారంటూ మరో వార్త సోషల్ మీడియా కెక్కింది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తదుపరి మూవీ రాజమౌళితో ఉండొచ్చు అనే టాక్ ఉండగా.. ఇప్పుడు కొత్తగా మైత్రీ మూవీ మేకర్స్ వారు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజుతో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అంటూ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. మైత్రి వారు లోకేష్ కనగరాజుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది మహేష్ కోసమే అని ప్రచారం జరుగుతుంది. మరి నిన్న రామ్ చరణ్ పేరు, నేడు మహేష్ పేరు, రేపు ఏ హీరో పేరు మైత్రి - లోకేష్ కనగరాజుల కాంబోలో వచ్చి చేరుతుందో చూడాలి.

Gossips on Mythri Movie Makers and Lokesh Kanagaraj combo:

Heroes changed for Mythri Movie Makers and Lokesh Kanagaraj combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ